పత్రిక ప్రకటన
తేదీ: 30-8-2021
నారాయణపేట జిల్లా
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఒక ఉజ్వలమైన భవిష్యత్తు ఇవ్వాలనే దృఢ సంకల్పం కలిగివుండీ విద్యాభ్యాసం చేయించాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్త్రీ శిశు సంక్షేమ కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలోని బుడగ జంగం సామాజిక పెద్దలు, సంఘ నాయకులతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. బుడగ జంగం సామాజిక వర్గం వారు జిల్లా వ్యాప్తంగా విస్తరించి ఉన్నారని అయితే వారి పిల్లలను పాఠశాలల్లో విద్యాభ్యాసం చేయించకుండా యాచకవృత్తికి ప్రిత్సహించడం సరిఅయ్యింది కాదన్నారు. కేవలం పేదరికాన్ని బూచి చూపిస్తూ పిల్లల ను యాచకవృత్తికి పంపించడం మానుకోవాలని సూచించారు. విద్యా పరంగా ప్రభుత్వం అనేక అవకాశాలు కల్పించడం జరిగిందని, ప్రభుత్వ పాఠశాలతో పాటు గురుకుల, కె.జి.బి.వి లు, సంక్షేమ హాస్టల్ వంటివి ఉన్నాయన్నారు. విద్యార్థులను పాఠశాలల్లో చేర్చుకోడానికి కుల మత భేదాలు లాంటివి ఏమియు ఉండవన్నారు. బుడగ జంగం వారు ఒక దగ్గర కాకుండా సంచారం చేస్తుంటారని, ఒకే దగ్గర ఉంటే వారి కొరకు ప్రత్యేకంగా పాఠశాల సైతం ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో బుడగ జంగం వర్గం నుండి బడి ఈడు పిల్లల వివరాలు ఇవ్వాలని, వారి వయసు, చదువుతున్న తరగతి ఆధారంగా నాణ్యమైన విద్యాబ్యాసానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. సామాజిక ఆర్థిక పరంగా ఉన్న ఇబ్బందులను సైతం పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. కళా రంగంలో పని చేసి వృద్ధాప్యంలో ఉన్న వారికి సాంస్కృతిక శాఖ ద్వారా పెన్షన్ కొరకు జిల్లా పౌర సంబంధాల అధికారి ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి పి. వేణుగోపాల్, చైల్డ్ వెలిఫెర్ కమిటీ చైర్మన్ అశోక్, డి.సి.పి.ఓ కుసుమలత, బుడగ జంగాల సంఘ నాయకులు,
తదితరులు పాల్గొన్నారు.
———————–
జిల్లా పౌర సంబంధాల అధికారి, నారాయణపేట ద్వారా జారీ.