ప్రతి దరఖాస్తుకు ఖచ్చితంగా స్పందించాలి…

ప్రచురణార్థం

ప్రతి దరఖాస్తుకు ఖచ్చితంగా స్పందించాలి.

మహబూబాబాద్, డిసెంబర్ 13.

ప్రజావాణిలో స్వీకరించిన ప్రతి దరఖాస్తుకు ఖచ్చితంగా సమాధానం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలోని ప్రగతి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ 52 దరఖాస్తులు స్వీకరించారు.

కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన మతిస్థిమితం కోల్పోయిన దివ్యాంగుడు బానోతు వినయ్ పుట్టుకతోనే మూగ వాడని గత రెండు నెలల నుండి పింఛన్ రావడం లేదని, చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు బానోతు బద్రు అనిత కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు.

కేసముద్రం మండలానికి చెందిన దివ్యాంగులు కిష్టాపురం గ్రామం నుండి నిమ్మరబోయిన యకమ్మ బ్యాటరీ సైకిల్ కావాలని, ఇనుగుర్తి మండలానికి చెందిన దేవునిపల్లి సునీల్ కుమార్ బ్యాంకు రుణం మంజూరు చేయించాలని కేసముద్రం కు చెందిన వ్యవసాయ కూలీ జాటోత్ వీరన్న మూడు చక్రాల బ్యాటరీ సైకిల్ కావాలని వ్యాపారం చేసుకుంటున్న ఉప్పల కేతమ్మ మూడు చక్రాల సైకిల్ కావాలని దరఖాస్తులు అందించారు.

మహబూబాబాద్ మండలం మల్యాల గ్రామ పరిధిలోని చిన్న రామోజీ తండా కు చెందిన దివ్యాంగుడు బానోతు లచ్చు బ్యాటరీ సైకిల్ కోసం దరఖాస్తు అందించారు.

కురవి మండలం గుండ్రాతిమడుగు గ్రామం కు చెందిన బ్రాహ్మణపల్లి లక్ష్మయ్య తనకు సర్వేనెంబర్ లోని 480-ఏ లో మూడెకరాల ఏడు కుంటల భూమి ఉందని అందులో ఒక ఎకరం 38 కుంటలు పాస్ బుక్ లో చేర్చలేదని తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.

కేసముద్రం కు చెందిన జ్యోతి తనకు మనస్విని, మనస్విక, ధరమ్ తేజ్ ముగ్గురు పిల్లలని, భర్త విడిచిపెట్టాడని ఇంటర్ వరకు చదువుకొని ఉన్నందున జీవనోపాధి కల్పించాలని విజ్ఞప్తి చేసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి దరఖాస్తుకు తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ గ్రీవెన్స్ డే లో అదనపు కలెక్టర్ కొమరయ్య, జడ్పీ సీఈవో రమాదేవి డిఆర్డిఎ పిడి సన్యాసయ్య, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
———————————————————————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post