ప్రతి దరఖాస్తుకు తప్పని సరిగా సమాధానం ఇవ్వాలి… జిల్లా కలెక్టర్ శశాంక

ప్రచురణార్థం

మహబూబాబాద్, సెప్టెంబర్-06:

గ్రీవెన్స్ లో స్వీకరించిన ప్రతి దరఖాస్తుకు తప్పని సరిగా సమాధానం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

సోమవారం గ్రీవెన్స్ డే పురస్కరించుకుని ప్రజల నుండి ఫిర్యాదులు విజ్ఞప్తులు స్వీకరించారు.

గూడూరు మండలం గుండెంగ గ్రామానికి చెందిన దివ్యాంగుడు కందిక సాయిలు తనకు బ్యాటరీ సైకిల్ మంజూరు చేయాలని కోరారు.

కేసముద్రం మండలం కోరుకొండ పల్లి పరిధిలోని భూమిని తన కొడుకులు వీరారెడ్డి సాంబరెడ్డి చెరొక 8 ఎకరాలు పంచుకున్నారని పట్టించుకోవడంలేదని అలంఖానిపేట కు చెందిన వృద్ధురాలు దరఖాస్తు అందించారు.

బయ్యారం మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన గిరిజనులు తమ పేరు పై ఉన్న ఆరు ఎకరాలను గిరిజనేతరుల అయిన నద్దునూరి వెంకన్న లింగన్న అన్నదమ్ములు ఆక్రమించారని తనను సేద్యం చెయ్య నీయడం లేదని గిరిజన దంపతులు దరఖాస్తు అందించారు.

నర్సింహులపేట మండలం నాగారం కు చెందిన పులిచింత రవీందర్రెడ్డి తనను పిల్లలను వెళ్లగొట్టడానికి మూడు ఎకరాల లో ఎకరం ఎనిమిది గుంటలు తనకు తెలియకుండా విక్రయించు కున్నాడని పులిచింత రవీందర్ రెడ్డి సతీమణి దరఖాస్తు అందించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి లో స్వీకరించిన ప్రతి దరఖాస్తును తప్పనిసరిగా వారంలోగా పరిష్కరిస్తూ సమాధానం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

గ్రీవెన్స్ డే లో అదనపు కలెక్టర్ కొమురయ్య జిల్లా అధికారులు ఉప తాసిల్దార్ లు పాల్గొన్నారు.
—————————————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి, మహబూబాబాద్ కార్యాలయంచే జారీచేయనైనది.

Share This Post