ప్రతి ధరఖాస్తును సమగ్రంగా విచారించి, చర్యలుతీసుకోవాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

ప్రతి ధరఖాస్తును సమగ్రంగా విచారించి, చర్యలుతీసుకోవాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

పత్రికాప్రకటన                                                                                                                                                                                                                                                     తేదిః 16-09-2021

ప్రతి ధరఖాస్తును సమగ్రంగా విచారించి, చర్యలుతీసుకోవాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

జగిత్యాల, సెప్టెంబర్ 16: వివిధ సమస్యల పరిష్కారం కొరకు తహసీల్దార్ల వద్దకు వచ్చే ప్రతి ధరఖాస్తును క్షుణంగా పరిశీలించిన తరువాతే వాటిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రవి పేర్కోన్నారు.  గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వివిధ రెవెన్యూ అంశాలపై ఆర్డిఓలు, తహసీల్దార్లతో జూమ్ వెబ్ వీడియో కాన్ఫరెన్స్  నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, కళ్యాణలక్ష్మి, షాధిముబారక్ ల కొరకు వచ్చే ప్రతి ధరఖాస్తుపై వెంటనే తహసీల్దార్లు తగిన చర్యలు తీసుకోవాలని, ఎమ్మెల్యేల అనుమతికి పంపించిన ధరఖాస్తులను త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని,  బడ్జెట్ ప్రకారం ధరఖాస్తులపై తుది కార్యచరణ చేపట్టి లబ్దిదారులకు అందించేలా చర్యలు చేపట్టాలని అన్నారు.  సాంకేతిక సమస్యలపై  పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించుకోని,  అర్హతల మేరకు మాత్రమే లబ్దిచేకూర్చాలని పేర్కోన్నారు.  గడువు దాటిపోయిన, వివిధరకాల సర్టిఫికేట్లు మరియు సర్వే కొరకు వచ్చిన పిటీషన్ల  పై  సర్వె చేయించి త్వరగా చర్యలు తీసుకోవాలని,  ప్రజావాణి ధరఖాస్తులపై చర్యలు తీసుకోవాలని, దరణీ ద్వారా వచ్చే ధరఖాసును క్షుణంగా పరిశీలించాలని, పెండింగ్ మ్యుటేషన్లను  తిరస్కరించె ముందు క్షుణంగా పరిశీలించి తదుపరి చర్యల కై పంపించాలని,  చర్యల కొరకు తహసీల్దార్ల ద్వారా కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన ప్రతి ధరఖాస్తుపై 24గంటలలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  ప్రోహిబిషన్ లో నమోదు చేసిన భూమి కొరకు వచ్చిన ధరఖాస్తులపై తక్షణ చర్యలు తీసుకోవాలని,  విరాసత్ కొరకు వచ్చే ధరఖాస్తులపై పూర్తిస్థాయిలో విచారణ చేసిన తరువాతే వాటిపై చర్యలు తీసుకోవాలని సూచించారు.  ఇసుక అక్రమ రవాణపై రెవెన్యూ పోలీసు అధికారులతో కలిసి ప్రత్యేకంగా రాత్రిపూట ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, మండలంలో ఉన్న ప్రభుత్వం భూములను ప్రత్యేకంగా మున్సిపాలిటిలలో గుర్తించి వాటిని సర్వేచేసి, ఫోటోలతో కూడిన వివరాలను ల్యాండ్ బ్యాంక్ లొ పొందుపరచాలని,  ప్రభుత్వ స్థలాల్లో ఎటువంటి అక్రమ నిర్మాణాలు జరగకుండా చూడడంతో పాటు, భూములను పర్యవేక్షించాలని అన్నారు. విడతల వారిగా భూపంపిణి కార్యక్రమం ద్వారా లబ్దిదారులకు పట్టా సర్టిఫికేట్లు జారి చేసి హద్దులు చూపించని వారిని గుర్తించి  లబ్దిదారులకు స్థలాలను సర్వే చేసి హద్దులు చూపించి మోకా అప్పగించాలని, ఫీల్డ్ వెరిఫికేషన్ చేసిన అనంతరం చర్యలు తీసుకోవాలని సూచించారు.   ఈఆర్ఓ,  ఎఈఆర్ఓ, బిఎల్ఓ వర్కింగ్ అన్నీ పోలింగ్ స్టేషన్లలలో బిఎల్ఓ బ్యాంకు అకౌంట్లను పరిశీలించి కలెక్టర్ కార్యాలయం, ఎలక్షన్ అధికారులకు నివేధికలను పంపించాలని సూచించారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి, జగిత్యాలచే జారీచేయబడినది

Share This Post