ప్రతి ధరఖాస్తు సకాలంలో పరిష్కరించబడాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

పత్రికాప్రకటన తేదిః 16-12-2021
ప్రతి ధరఖాస్తు సకాలంలో పరిష్కరించబడాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి
జగిత్యాల, డిసెంబర్ 16:
వివిధ సమస్యల పరిష్కారం కై వచ్చే ప్రతి ధరఖాస్తుల పరిష్కారం పై అలస్యం జరగకుండా అధికారులు సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు. గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వివిధ రెవెన్యూ సంబంధిత అంశాలపై ఆర్డిఓలు, తహసీల్దార్లతో జిల్లా కలెక్టర్ జూమ్ వెబ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, కళ్యాణలక్ష్మీ, షాధిముబారక్ మంజూరు కొరకు వచ్చే ధరఖాస్తులను తహసీల్దార్ ఎప్పటిక్పప్పుడు పర్యవేక్షిస్తూ, బడ్జెట్ ప్రకారం లబ్దిదారులకు చెక్కులను అందించేలా చర్యలు తీసుకోవాలని. మంజూరిలో ఎవైన సాంకేతిక సమస్యలు ఎర్పడినట్లయితె వాటిని పరిష్కరించాలని సూచించారు. ధరణి స్లాట్ బుక్క్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోని వారికి వాటిని క్యాన్సల్ చేసుకునే అవకాశం వచ్చినందున, ధరఖాస్తుదారులకు వారి ధరఖాస్తుసను క్యాన్సల్ చేసుకోవాల్సిందిగా తెలియజేయాలని పేర్కోన్నారు. సర్టిఫికేట్ ల జారిలో దృవీకరణలను జాగ్రత్తగా పరిశీలించాలని, మ్యానువల్ ఫైళ్లను తగ్గించి, ఈ ఆఫీస్ ద్వారా పరిష్కరించాలని, తద్వారా ఫైళ్లపై చర్యలు తీసుకోవడంలో అలస్యం జరగకుండా నివారించగలగుతామని పేర్కోన్నారు. జిల్లాలో ఇసుకు కొరకు పలు రీచ్ లకు అనుమతులు ఇవ్వడం జరిగినందున, సంబంధిత శాఖ అధికారుల సమన్వయంతో ఇసుక అక్రమరవాణా జరుగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ చర్యలు తీసుకోవాలన అన్నారు. ధర్మపురి నియోజక వర్గంలో దాన్యం కొనుగోలు ఇంకా కొనసాగుతుందని, దాన్యం లోడుతో మిల్లులకు వెళ్లిన చోట అలస్యం జరగకుండా పర్యవేక్షించడంతో పాటు, వివిధ ధరఖాస్తులు, ఇతర ఫైళ్ల పరిష్కారంలో ఎటువంటి అలస్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమీక్షలో స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ శ్రీమతి జె. అరుణశ్రీ, జగిత్యాల, కోరుట్ల ఆర్డిఓలు శ్రీమతి ఆర్.డి. మాదురి, టి. వినోద్ కుమార్, అన్ని మండలాల తహసీల్దార్లు, కలెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్లు, తదితరులు పాల్గోన్నారు.

ప్రతి ధరఖాస్తు సకాలంలో పరిష్కరించబడాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాల చే జారిచేయనైనది.

Share This Post