ప్రతి నెల 10వ తేది లోగా అభివృద్ధి సమగ్ర నివేదికలు అందజేయాలి  : జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి

జిల్లాలో మండల స్థాయిలో ప్రతి శాఖకు నంబంధించిన అభివృద్ధి, ప్రగతిపై నమ గ్ర నివేదికలను ప్రతి నెల 10వ తేదీ లోగా ప్రణాళిక శాఖచే తయారు చేయబడిన వెబ్‌పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన నమావేశ మందిరంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి కె.కృష్ణయ్యతో కలిని అన్ని శాఖల అధికారులతో నమీక్ష నమావేశం నిర్వహించారు. ఈ నందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలో అన్ని విధాలుగా వెనుకబడిన జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని మండల స్థాయిలో జరుగుచున్న అభివృద్ధి, పనుల పురోగతిపై పర్యవేక్షించి నంబంధిత నివేదికలను ప్రతి నెల 10వ తేదీలోగా క్రమం తప్ప ప్రణాళిక శాఖ వెబ్‌పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలని, అన్ని శాఖల అధికారులు మండల స్థాయిలో జరుగుతున్న అభివృద్ధి పథకాల నూచికలను పర్యవేక్షించాలని తెలిపారు. ఆరోగ్యం, కుటుంబ నంక్షేమం, స్రీ, శిశు నంక్షేమం, విద్య, వ్యవసాయం, విద్యుత్‌, హౌనింగ్‌, రోడ్లు-భవనాలు, పి.ఆర్‌. & ఆర్‌.డి. తదితర అన్ని శాఖలకు నంబంధించిన వివరాలు అప్‌లోడ్‌ చేయాలని తెలిపారు. పాఠశాల స్థాయి నుంచే పిల్లలకు నాణ్యమైన విద్య అందించి మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని, పిల్లల ఎదుగుదల లోపాలను అధిగమించే విధంగా నరైన పౌష్టికాహారం అందించాలని తెలిపారు. గర్భిణులు క్రమం తప్పకుండా వైద్య సేవలు పొందాలని, తమ వివరాలను నమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నమోదు చేనుకోవాలని, ఆనుషత్రిలోనే ప్రసవం అయ్యే విధంగా నంబంధిత అధికారులు అవగాహన కల్పించడంతో పాటుకె.ని. ఆర్‌. కిట్టు అందజేయాలని తెలిపారు. మండల స్థాయి కమిటీలపై పర్యవేక్షించడానికి జిల్లా స్థాయి కమిటీని జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన చైర్మన్‌ హోదాలో ఏర్పాటు చేసి ముఖ్య ప్రణాళిక అధికారి మెంబర్‌ కన్వీనర్‌గా, వివిధ శాఖల అధికారులను నభ్యులుగా నియమించి ప్రత్యేక పర్యవేక్షణ చేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post