ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి బదిలీలు సాధారణం విధులు నిర్వహించిన చోట మంచి పేరు సంపాదించుకోవాలి జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్ వీడ్కోలు సమావేశంలో కలెక్టర్ హరీశ్

 

పత్రిక ప్రకటన

తేదీ : 11–11–2022

ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి బదిలీలు సాధారణం

విధులు నిర్వహించిన చోట మంచి పేరు సంపాదించుకోవాలి

జిల్లా అదనపు కలెక్టర్​ శ్యాంసన్​ వీడ్కోలు సమావేశంలో కలెక్టర్​ హరీశ్​

ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి బదిలీలు సర్వసాధారణమని… అయితే వారు ఏ ప్రాంతానికి బదిలీపై వెళ్ళినా తమకంటూ ఒక గుర్తింపును, మంచి పేరు సంపాదించుకోవాలని అప్పుడే వారు పని చేసి వెళ్ళినా వారిని ప్రజలు, అధికారులు ఎల్లప్పుడూ గుర్తుంచుకొంటారని మేడ్చల్​ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్​ హరీశ్​ అన్నారు. జిల్లా అదనపు కలెక్టర్​గా విధులు నిర్వహించి ఇటీవల బదిలీపై వెళ్తున్న శ్యాంసన్​ వీడ్కోలు సమావేశాన్ని శుక్రవారం జిల్లా కలెక్టరేట్​ సమావేశ మందిరంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన కలెక్టర్​ హరీశ్​ మాట్లాడుతూ… ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి బదిలీలు సర్వసాధారణమేనని ఈ విషయంలో వారు ఎక్కడకు వెళ్ళినా తమకంటూ ఒక మంచి గుర్తింపును, ప్రజల మన్ననలు  పొందాలన్నారు. ఈ విషయంలో అదనపు కలెక్టర్​గా విధులు నిర్వహించిన శ్యాంసన్​ ప్రజా సమస్యలపై ప్రత్యేక చొరవ తీసుకొనే వారని ఈ సందర్భంగా ప్రశంసించారు. అదే విధంగా బదిలీపై వెళ్ళిన చోట వారికంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నట్లయితే ప్రజలు ఎల్లప్పుడూ వారిని గౌరవిస్తారని అన్నారు. జిల్లా అదనపు కలెక్టర్​గా విధులు నిర్వహించిన శ్యాంసన్​ అందరితో కలుపుగోలుగా ఉంటూ ప్రజల సమస్యలను తీర్చడంలో సైతం మంచి పేరు సంపాదించారని ఇది ఎంతో గర్వకారణమని కలెక్టర్​ ఆయన సేవలను కొనియాడారు. ప్రభుత్వ ఉద్యోగంలో బదిలీలు జరుగుతాయని ప్రతి చోటా మంచి పేరు సంపాదించుకోవాలని అదే చిరస్థాయిగా నిలిచిపోతుందని కలెక్టర్​ తెలిపారు. ఈ సందర్భంగా బదిలీపై వెళ్తున్న శ్యాంసన్​ను పూలమాలలు, శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. అనంతరం నూతనంగా అదనపు కలెక్టర్​గా బాధ్యతలు స్వీకరించిన అభిషేక్​ అగస్త్యను పూలమాలలు, శాలువాలు, మెమొంటోలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్​ అభిషేక్​ అగస్త్య,  జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్​, జడ్పీ సీఈవో దేవసహాయం,   కలెక్టరేట్​ ఏవో వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post