ప్రతి మంగళ, శుక్రవారాలలో డ్రైడే కార్యక్రమాలను నిర్వహించాలి జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

ప్రతి మంగళ, శుక్రవారాలలో డ్రైడే కార్యక్రమాలను నిర్వహించాలి

 

జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

 

0 0 0 0

 

           ప్రజలు అనారోగ్యo బారిన పడకుండ ఉండేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రతి మంగళ, శుక్రవారాలలో డ్రైడే కార్యక్రమాలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు.

 

          శుక్రవారం సాయంత్రం కలెక్టరేట సమావేశ మందిరంలో సబ్ సెంటర్ల భవన నిర్మాణ ప్రగతి, గర్బీణిల నమోదు, రక్తహీనత, డెంగ్యూ మరియు ఇతర ఆరోగ్య కార్యక్రమాలపై వైద్యాధికారులతొ సమావేశాన్ని నిర్వహించారు.   ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ  కొత్తపల్లి, మానకొండూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో నమోదు అవుతున్న డెంగ్యూ కేసుల దృశ్యా ప్రతి మంగళ, శుక్రవారాలలో స్థానిక సిబ్బంది సహాకారంతో డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించాలని అన్నారు.  అదేవిధంగా డెంగ్యూ వ్యాది నివారణకు ముందస్తు చర్యలను తీసుకొని వ్యాధి తీవ్రతను సమర్దవంతంగా తగ్గించడానికి కృషిచేసిన వైద్య, పంచాయితి సిబ్బందిని కలెక్టర్ అభినందించారు.  గర్బిణీల నమోదు వంద శాతం లక్ష్యాలను సాదించాలని, ప్రభుత్వ ఆసుపత్రులలో సాదారణ ప్రసవాలను ప్రోత్సహించాలని తెలిపారు.

.

వాష్ (వాటర్, సానిటేషన్ మరియు హగ్నీస్)  లో బాగంగా జిల్లాను  యునిసెఫ్  అంగన్ వాడి కేంద్రాలలో మరియు సబ్ సెంటర్ లలో మరగుదొడ్ల ఏర్పాటు మరియు పునరుద్దరణకు 29 సబ్ సెంటర్ లు, 109 అంగన్ వాడి సెంటర్లును ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు.ఈ నెల 25 నుండి డిసెంబర్1వ తేది వరకు  నేషనల్ న్యూ బార్న్ వీక్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు.  ఈ కార్యక్రమంలో బాగంగా నాణ్యమైన ఆరోగ్య సేవలను అప్పుడే పుట్టిన బిడ్డలకు అందించడం  కార్యక్రమ ప్రదాన ఉద్దేశ్యమని తెలిపారు.

 

           ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా వైద్యాధికారి జువేరియా,  స్త్రీ శిశు సంక్షేమాధికారి సభితా కుమారి, డిఆర్డిఓ శ్రీలతా రెడ్డి,  ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్  రత్నమాల, ప్రభుత్వ డాక్టర్ల, సిడిపిఓలు, అంగన్ వాడి సూపర్ వైజర్లు పాల్గోన్నారు.

Share This Post