ప్రతి మండలంలో ఏర్పాటు చేస్తున్న బృహత్ పల్లె ప్రకృతి వనాల పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ యల్. శర్మన్ మండల అభివృద్ధి అధికారులను ఆదేశించారు.

పత్రిక ప్రకటన
తేదీ: 10-8-2021
నాగర్ కర్నూల్ జిల్లా.
ప్రతి మండలంలో ఏర్పాటు చేస్తున్న బృహత్ పల్లె ప్రకృతి వనాల పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ యల్. శర్మన్ మండల అభివృద్ధి అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం తన క్యాంపు కార్యాలయంలో మండల ప్రత్యేక అధికారులు, ఎంపిడిఓ లతో హరితహారం కార్యక్రమం పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివరిస్తూ ఇప్పటికే అన్ని మండలాల్లో బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు స్థలం గుర్తించి అప్పగించడం జరిగిందని, స్థలాన్ని చదును చేసి మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వే కార్యక్రమం పూర్తి చేయాల్సిందిగా ఆదేశించారు. హరితహారంలో ఇచ్చిన లక్ష్యం మేరకు వంద శాతం మొక్కలు నతల్సిందేనని ఎలాంటి మినహాయింపులు ఉండవని హెచ్చరించారు. మొక్కలు నాటే క్రమంలో వేళ్ళు కదిలిపోవడం వల్ల చనిపోయిన మొక్కల స్థానంలో వెంటనే వేరే మొక్కలు నాటాలని ఆదేశించారు. అన్ని ప్రధాన రోడ్లు, గ్రామ పంచాయతీ రోడ్ల పక్కన మోక్కలు నాటాలని, ప్రధాన రహదారిపై మూడు వరుసల్లో మొక్కలు నాటి వాటి ఫోటోలు వాఁట్సాప్ లో పెట్టాల్సిందిగా సూచించారు. మండల ప్రత్యేక అధికారులు, ఎంపిడిఓ లు ప్రతిరోజు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని, హరితహారం మొక్కల పై పూర్తి స్థాయి పర్యవేక్షణ ఉండాలని సూచించారు. రోడ్డుకు దగ్గరగా కాకుండా దూరంగా ఆర్ అండ్ బి రోడ్డు పరిధి వరకు మొక్కలు నాటాలని తెలియజేసారు. ఇప్పటికే నాటిన మొక్కలకు నీరు పోయించాల్సిందిగా సూచించారు. వచ్చే వారం రోజుల్లో వంద శాతం గుంతలు తవ్వే కార్యక్రమం పూర్తి కావాలని, అన్లైన్ ప్రక్రియ సైతం పూర్తి చేసి ఫోటో అప్లోడ్ చేయాల్సిందిగా ఆదేశించారు.
అదనపు కలెక్టర్ మను చౌదరి, డిఆర్ డి ఏ పిడి నర్సింగ్ రావు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపిడిఓ లు పాల్గొన్నారు.
—————-
జిల్లా పౌర సంబంధాల అధికారి ద్వారా జారీ.

Share This Post