ప్రతి మండల ప్రభుత్వ కార్యాలయాలలో .. వీరి యొక్క వివరాలు ప్రదర్శించాలి*

నల్లగొండ జిల్లా పరిధిలో ఉన్న అన్ని మండల ప్రభుత్వ కార్యాలయాలలో     మండల  తాసిల్దార్ కార్యాలయం   ఆవరణలో మండల ఎం పి డి  వో కార్యాలయ ఆవరణ వద్ద ప్రాధమిక , ఆరోగ్య కేంద్రాల వద్ద, పోలీస్ స్టేషన్లో ఆవరణలో  అన్ని రకాల దిన పత్రికల రిపోర్ట్ ల, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల పేర్లు చరవాణి నెంబర్లు  పత్రికల పేర్లూ, మీడియా పేర్లతో ఉన్న పూర్తి సమాచారాన్ని ఆ యొక్క మండల పోలీస్ స్టేషన్ ఆవరణలో గోడపై ప్రదర్శించాలి  అన్ని మండలాలలో ఉన్న ప్రజలందరూ  ప్రభుత్వ కార్యాలయాలలో ఉద్యోగులు సరైన సమయానికి సేవలు అందించని యెడల  దరఖాస్తుదారుల  గోడును వెల్లబుచ్చు కోవడానికి ఉన్నతాధికారుల దృష్టికి గాని ఇటు ప్రభుత్వం దృష్టికి  గాని తీసుకువెళ్లే టువంటి వారిదే మీడియో పాత్ర .. మరి అలాంటి మీడియా మిత్రుల వివరాలు వారి యొక్క పత్రికల పేర్లు ప్రజలకు తెలిసేల ప్రభుత్వ కార్యాలయాల ఆవరణ లో ఏర్పాటు చేస్తే  ప్రదర్శన వాల్ పోస్టర్ ద్వారా ప్రజలు తెలుసుకుంటారు  ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం సంబంధిత అధికారులతో ఏర్పాటు చేయించాలని మరి ముఖ్యంగా ప్రతి మండలంలోని తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో మీ సేవ  మరియు ఆధార్ నమోదు కేంద్రాల నిర్వాహకుల చిరునామా వివరాలు పేర్లు చరవాణి నెంబర్లు కూడా ఏర్పాటు చేయాలని నేడు గ్రీవెన్స్ రోజున  అదనపు కలెక్టర్  వనమాల చంద్రశేఖర్ సమాచార హక్కు ప్రజా చైతన్య సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  యన్నమల్ల భాస్కర్ వినతి పత్రం అందజేశారు ఈ యొక్క కార్యక్రమంలో నేస్తం  స్వచ్ఛంద  సేవా సంస్థ అధ్యక్షులు డాక్టర్ టి జి లింగం గౌడ్ పాల్గొన్నారు.
ప్రతి మండల ప్రభుత్వ కార్యాలయాలలో .. వీరి యొక్క వివరాలు ప్రదర్శించాలి*

Share This Post