ప్రచురణార్ధం
మహబూబాబాద్, మార్చి,25.
ప్రతి మహిళకు ఆరోగ్య మహిళ క్రింద చేపడుతున్న ఎనిమిది టెస్టులను తప్పనిసరిగా చేయాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.
ఐ డి ఓ సి లోని కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆరోగ్య మహిళ లక్ష్యాల సాధింపు పై కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్షించారు
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళల్లో అనారోగ్య సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆరోగ్య మహిళ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, ముందుగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఆరోగ్య మహిళ క్రింద చేపడుతున్న ఎనిమిది టెస్టులను తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. ప్రజా ప్రతినిధులు ఎంపీడీవోలు ఉపాధ్యాయులు హాస్టల్ వార్డెన్లు పంచాయతీ సెక్రెటరీ లలో ఉన్న మహిళలు అంగన్వాడి టీచర్లు ఆశాలు ఏఎన్ఎంలు ప్రతి ఒక్కరికి ఆరోగ్య మహిళ టెస్టులు నిర్వహించాలన్నారు. ప్రతి పి ఎస్ సి 100 టెస్టులు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు జిల్లాలో ఐదు పీ ఎస్ సి లలో మహిళా డాక్టర్లు ఉన్నారని ఆయాపీఎస్సీలోనే ప్రతి మంగళవారం మహిళల్ని పరీక్షించాలన్నారు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్ ఉందని ఉచితంగా 57 రకాల పరీక్షలు నిర్వహించవచ్చునని శాంపిల్స్ ఎక్కువగా సేకరిస్తూ పరీక్షలు ఎక్కువగా నిర్వహించాలన్నారు జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు కావడంతో వైద్య నిపుణులు అందుబాటులో ఉన్నారన్నారు.
ఆరోగ్య మహిళ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు అధికారులను నియమించారు ప్రతి వారం సమీక్షించి నివేదిక అందజేయాలన్నారు.
ఈ సమీక్ష సమావేశంలో జడ్పీ సీఈవో రమాదేవి డిఆర్డిఏ పిడి సన్యాసయ్య వైద్య శాఖ అధికారి హరీష్ రాజు జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త డాక్టర్ శ్రీనివాస్ ఉపవైద్య శాఖ అధికారులు అంబరీష ఉమా గౌరీ మురళీధర్ డాక్టర్లు అయోధ్య పురం పీహెచ్సీ కి చెందిన డాక్టర్ యమునా దంతాలపల్లి డాక్టర్ చైతన్య గంగారం డాక్టర్ ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు.