పత్రిక ప్రకటన
తేదీ; 7-8-2021
నారాయణపేట జిల్లా.
ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసి పట్టాలి, భూగర్భ జలాలను పెంచాలి – కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్*
ప్రతి వర్షపు నీటిని ఒడిసి పట్టి భూగర్భ జలాలు పెంపొందించే దిశగా పనులు నిర్వహించాలని దీనిని ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా భావించే విధంగా చూడాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు.
మంగళవారం న్యూఢిల్లీ జల్ శక్తి భవన్ నుండి జలశక్తి అభియాన్ కార్యక్రమాన్ని వర్చువల్ విధానం ద్వారా తెలంగాణ, గోవా, జమ్మూ తదితర రాష్ట్రాల జిల్లా కలెక్టర్లతో కేంద్ర జల శక్తి శాఖ మంత్రి సమీక్షించారు.
ఈ సందర్భంగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ….
సాంకేతిక పరిజ్ఞానంతో వర్షపు నీటిని ఒడిసి పట్టి భూగర్భ జలాలు పెంచుకునే దిశగా పనులు చేపట్టాలన్నారు. నీటి సంరక్షణ కార్యక్రమాల కోసం ఆరు సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతుందన్నారు.
భావితరాల వారికి నీటిని అందించే దిశగా కార్యక్రమాలను రూపొందించడం జరుగుతున్నదని, వాటిని సద్వినియోగ పర్చుకోవాలన్నారు.
నీటిని నిలువరించక పోతే భవిష్యత్ తరాలవారికి అనేక సమస్యలు ఎదుర్కొవల్సి వస్తుందన్నారు.
ప్రభుత్వం చేపట్టే జలశక్తి అభియాన్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.
నీటి సంరక్షణ పనులు సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహించాలని, ఉపాధి హామీ నిధులను వినియోగించుకోవాలన్నారు.
పెరుగుతున్న జనాభా దృష్ట్యా వాతావరణ కాలుష్యం వల్ల రాను రాను నీటి సాంద్రత తగ్గుతుందని ఇప్పటి నుంచే ప్రతి ఒక్కరూ అప్రమత్తమై నీటిని వృథా పోనీయ కుండా చూడాలని ఆయన అధికారులను కోరారు.
ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకునేలా చూడాలని
ప్రజలకు నీటి పొదుపు పై అవగాహన కల్పించేందుకు ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. జిల్లాల్లో ఉన్న అన్ని నీటి చెరువులు, ట్యాన్క్ లను గుర్తించి వాటికి ఆన్లైన్లో జియో ట్యాగింగ్ చేయాలని సూచించారు. హైదరాబాద్ లో నిజాం కాలంలో ఉన్న అనేక చెరువులు నేడు కర్మరుగయ్యాయని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు. భవిష్యత్తులో ఆక్రమణలు జరిగిన గుర్తించేందుకు జియో ట్యాగ్ చేసి అప్లోడ్ చేయడం శ్రేయస్కరమన్నారు.
ఈ సందర్బంగా తెలంగాణ జిల్లాల నుండి కలెక్టర్ డి. హరిచందన మాట్లాడారు. గత రెండు మూడు సంవత్సరాల నుండి నారాయణపేట జిల్లాలో నీటి సంరక్షణకు పలు కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, అడవుల్లో వాటర్ షెడ్ల నిర్మాణం, చిన్న చిన్న కుంటలు ఏర్పాటు చేయడం, పర్క్యులేషన్ ట్యాన్క్ తదితర కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తద్వారా జిల్లాలో భూగర్భ జలాలు భారీగా పెరిగాయని తెలియజేసారు. కేంద్ర ప్రభుత్వ సూచనలు పాటించి నీటి సంరక్షణకు అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు.
————————