ప్రతి వార్డులో టెట్రావర్మీబెడ్లు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ మున్సిపల్ కమిషనర్లును ఆదేశించారు.

బుధవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో ఇంటింటి నుండి తడి, పొడి వ్యర్థాలు సేకరణ, మరుగుదొడ్లు నిర్వహణ, ప్లాస్టిక్ వాడకం తగ్గించడం, వర్మికంపోస్టు ఎరువులు తయారు, ఇంటిపన్నులు, హరితహారం, పల్లె, బృహత్ పకృతివనాలు నిర్వహణపై మున్సిపల్ సిబ్బంది, ప్రత్యేక అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి మున్సిపాల్టీలో చేపట్టిన ఒక అంశంపై తయారు చేసిన పవర్పాయింట్ ప్రజెంటేషనన్ను ఆయన పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి వార్డులో ఇంటింటి నుండి సేకరించిన వ్యర్థాలను వర్మి తయారు చేయుటకు సులభమైన పద్ధతి ద్వారా టెట్రావరి బెడ్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ విధానం ద్వారా 45-60 రోజుల్లో వర్మి తయారవుతుందని, వర్మిని మొక్కలకు వినియోగించడం వల్ల మంచిగా పెరిగేందుకు దోహదపడతాయని చెప్పారు. ప్రతి మున్సిపాల్టీని డస్ట్బిన్ ఫ్రీ మున్సిపాల్టీగా తయారు చేయాలని చెప్పారు. ఆరుబయట వ్యర్థాలు కనిపించడానికి వీల్లేదని, పట్టణాలు రోజు రోజుకు అభివృద్ధి చెందుతుంటే వ్యర్థాలు బయట కనిపిస్తున్నాయని నియంత్రణ చేయాలని చెప్పారు. ప్రతి మున్సిపాల్టీలో పారిశుద్య ప్రణాళిక అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు. వ్యర్థాలు నిర్వహణపై సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. మన మున్సిపాల్టీని ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలో అన్న సంకల్పం ప్రజల నుండి రావాలని, అపుడే ప్రజల నుండి మనకు చక్కటి సహాకారం లభిస్తుందని చెప్పారు. ప్రతి మున్సిపాల్టీని ఆదర్శంగా తీర్చిదిద్దాలన్న సంకల్పం కావాలని, మనం ఎందుకు చేయలేమనే లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకుపోవాలని చెప్పారు. మీరందరూ అనుకుంటే తప్పకుండా సాధించగలరని అది సాధ్యపడుతునందని ఆయన పేర్కొన్నారు. స్వచ్చ సర్వేక్షణ్ మన మున్సిపాల్టీలు దేశస్థాయిలో ముందుండాలని ఆయన స్పష్టం చేశారు. పల్లె పకృతి వనాలు గురించి ప్రస్తావిస్తూ రామవరం రామచంద్రా కళాశాలలో ఏర్పాటు చేసిన పకృతి వనం నిర్వహణ బావుందని, నిర్వహిస్తున్న సిబ్బందిని అభినందించారు. మహిళల మరుగుదొడ్లులో శానిటరీ నాప్కిన్స్ వేసేందుకు ఇన్నేటర్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. మరుగుదొడ్లు నిర్వహణ చాలా ముఖ్యమని సమయపాలన పాటించాలని చెప్పారు. ఇల్లందు మున్సిపల్ సిబ్బంది ప్లాస్టిక్ వినియోగించకుండా, ప్రతి ఇంటిలోను వర్మి తయారు చేయు విధంగా చర్యలు తీసుకోవడం ఎంతో అభినందనీయమని హర్షం వ్యక్తం చేశారు. మున్సిపాల్టీలలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పారు. బృహాత్ పల్లె పకృతివనాల్లో మొక్కల సంరక్షణకు చర్యలు చేపట్టాలని చెప్పారు. రహదారులకు ఇరువైపులా ఎక్కడా ఖాళీ స్థలం లేకుండా మొక్కలు నాటాలని, చనిపోయిన మొక్కల స్థానంలో కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని రెండు వారాల్లో పూర్తి చేయాలని చెప్పారు. ఇంటి పన్నులు గురించి ప్రస్తావిస్తూ బిల్ కలెక్టర్లు వారిగా సమీక్షా సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. జనవరి మాసం వరకు నూరు శాతం ఇంటి పన్నులు వసూలు కార్యక్రమం పూర్తి కావాలని చెప్పారు. నాలుగు మున్సిపాల్టీలలో శానిటరీ సిబ్బంది అద్భుతంగా పనిచేస్తున్నారని అభినందించారు.

 

ఈ సమీక్షా సమావేశంలో కొత్తగూడెం, మణుగూరు ప్రత్యేక అధికారులు అర్జున్, అలీం, పాల్వంచ, ఇల్లందు, మణుగూరు మున్సిపల్ కమిషనర్లు శ్రీకాంత్, అంజయ్య, నాగప్రసాద్, డిఈలు నవీన్, మురళి, టిపిఓలు తదితరులు పాల్గొన్నారు.

Share This Post