ప్రతి వార్డు లో వ్యాక్సిన్ వేయించుకునేలా వార్డు మెంబర్ లు ప్రజలకు అవగాహన కల్పించి టార్గెట్ ను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి వైద్యాధికారులకు, గ్రామ సర్పంచు లకు, వార్డు మెంబర్లకు ఆదేశించారు

ప్రతి వార్డు లో వ్యాక్సిన్ వేయించుకునేలా వార్డు మెంబర్ లు ప్రజలకు అవగాహన కల్పించి టార్గెట్ ను  పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి వైద్యాధికారులకు, గ్రామ సర్పంచు లకు, వార్డు మెంబర్లకు ఆదేశించారు.

బుధవారం మల్దకల్ మండలం లోని అమరవాయి, మల్దకల్ బస్టాండ్, రైతు వేదిక, అయిజ మండలం బింగి దొడ్డి లో ఏర్పాటు చేసిన వాక్సినేషన్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెండు రోజులలో 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయించేలా  చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. వైద్యాధికారులు సబ్ సెంటర్ లు విజిట్ చేయాలనీ, పంచాయతి సెక్రటరీ లు, గ్రామ సర్పంచులు, వాక్సినేషన్ పై ప్రజలను మోటివేట్ చేయాలనీ , మొదటి, రెండవ డోసు వేసుకునేలా ప్రజలలో అవగాహన కల్పించాలన్నారు. ఈ వారం రోజులలో మిగిలిపోయిన వారి పేర్లు జాబితాను వార్డు మెంబర్లకు అందజేసి వారి ద్వారా వ్యాక్సిన్ కేంద్రాలకు ప్రజలను  పిలుచుకు వచ్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి చందు నాయక్, సర్పంచ్ లు, పంచాయతీ కార్యదర్శి మాబి, ఎంపీడీవో, వైద్య అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

————————————————————————–

జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాల గారి చే జారి చేయబడినది.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Share This Post