ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని అట్టి లక్ష సాధనకు ఆకాంక్ష, తపన కలిగి ఉండాలి::జిల్లా కలెక్టర్ కె.శశాంక

ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని అట్టి లక్ష సాధనకు ఆకాంక్ష, తపన కలిగి ఉండాలి::జిల్లా కలెక్టర్ కె.శశాంక

ప్రచురణార్థం
సెప్టెంబర్ 23 మహబూబాబాద్

ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని అట్టి లక్ష సాధనకు ఆకాంక్ష, తపన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ కె.శశాంక అన్నారు. మోడల్ స్కూల్స్, కేజీబీవీ పాఠశాలల్లో పదవ తరగతి పరీక్షల్లో 9.5 కు పైన ర్యాంకు సాధించిన విద్యార్థులకు శుక్రవారం బాలాజీ గార్డెన్స్ లో జరిగిన అభినందన సభ, ప్రస్తుత సంవత్సరం పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో కేజీబీవీ మోడల్ స్కూల్ విద్యార్థులు 10/10 జిపిఎ ర్యాంకులను సాధించాలని జిల్లాలో వందకు పైగా 10/10 జి.పి ఎ ర్యాంకులు రావాలని కలెక్టర్ అన్నారు. అందుకుగాను ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని లక్ష్య సాధనకు తపన కలిగి ఉండాలని కలెక్టర్ అన్నారు. లక్ష్యాన్ని సాధించాలంటే సాధన, సమయపాలన తో పాటు లక్ష్యంపైనే గురి ఉండాలని సూచించారు. విద్యతో పాటు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. గడిచిన సమయం, కాలం తిరిగి రాదని, సమయాన్ని వృధా చేయకుండా నిరంతరం లక్ష్యసాధనకు కృషి చేయాలని కలెక్టర్ అన్నారు. జిల్లాలో పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 10/10జి.పి. ఎ ర్యాంకులు సాధించిన విద్యార్థులను స్ఫూర్తిగా తీసుకొని పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించాలని కలెక్టర్ అన్నారు.

జాతీయ స్థాయిలో ఇన్స్పైర్ అవార్డులకు ఎంపికైన కొరిపల్లి యుపిఎస్ విద్యార్థి ఎడ్ల నాని, బలపాల జడ్పిహెచ్ఎస్ విద్యార్థిని ఎన్ భవాని లను ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సన్మానించి అభినందించారు.

అదేవిధంగా 9.5 కు పైన ర్యాంకులు సాధించిన కేజీబీవీ, మోడల్ స్కూల్
(69 మంది) విద్యార్థిని విద్యార్థులకు కలెక్టర్ సన్మానించి ప్రశంసా పత్రాలను బహుమతులను అందజేశారు.

జిల్లా విద్యాశాఖ అధికారి మహమ్మద్ అబ్దుల్ హై, క్వాలిటీ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్
ఎం. బుచ్చయ, అసిస్టెంట్ కమిషనర్ శ్రీరాములు, జనరల్ కోఆర్డినేటర్ విజయ కుమారి, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్స్, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లు, జిల్లా సైన్స్ ఆఫీసర్ అప్పారావు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post