ప్రతి విద్యార్థి ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి – అదనపు కలెక్టర్ రమేష్

ప్రతి విద్యార్థి  ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి – అదనపు కలెక్టర్ రమేష్

విద్యార్థులందరు ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవలసినదిగా అదనపు కలెక్టర్ రమేశ్ సూచించారు. శనివారం కలెక్టరేట్ లోని ఎన్.ఐ.సి లో జిల్లాలోని ఒక్కో కళాలశాల నుండి క్యాంపస్ ఎంబాసీదార్లుగా ఎంపిక చేసిన విద్యార్థులకు ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతూ ఓటర్ యాప్ ద్వారా సులువుగా ఓటరు నమోదు చేసుకోవచ్చని, కాబట్టి 1 జనవరి 2022 నాటికి 18 సంవత్సరాలు పై బడిన ప్రతి యువత ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా ప్రతి కళాశాలలో విద్యార్థిని, విద్యార్థులలో ఓటు విలువ, ఓటరు నమోదు పై అవగాహన కలిగించి ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకునేలా ప్రేరణ కలిగించాలని సూచించారు. ప్రతి ఒక్కరు తమ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ ద్వారా ప్లే స్టోర్ లో యాప్ డౌన్ లోడ్ చేసుకొని పేరు నమోదు చేసుకునేల క్యాంపుస్ అంబాసిడర్లు కృషి చేయాలని కోరారు. ఈ నెల 27, 28 తేదీలలో ప్రతి బూతు స్థాయి నందు ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నామని అన్నారు. ఈ నెల 30 వరకు అర్హత కలిగిన ప్రతి యువత పేరు నమోదు చేసుకోవాలని కోరారు. ఈ యాప్ ద్వారా పేరు నమోదు తో పాటు, మార్పులు చేర్పులు, సవరణలు, ఒక నియోజక వర్గం నుండి మరో నియోజక వర్గం మార్పు, పేరు తొలగింపు వంటివి చేసుకోవచ్చని అన్నారు. అంతకు ముందు క్యాంపస్ అంబాసిడర్ లు అందరిచేత ఓటరు హెల్ప్ లైన్ యాప్ డౌన్ లోడ్ చేయించడంతో పాటు ఏ విధంగా పేరు నమోదు చేసుకోవాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులకు స్వీప్ నోడల్ అధికారి రాజీ రెడ్డి తో కలిసి స్వీప్ మెటీరియల్ ను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఈ. డి. ఏం. సందీప్, కలెక్టరేట్   ఏ. ఓ యూనుస్ , వివిధ కళాశాలల ఆద్యాపకులు పాల్గొన్నారు.

Share This Post