ప్రతి వినియోగదారుడు తన హక్కులతో పాటు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించినప్పుడే సమాజంలో జరుగుతున్న అన్యాయం, కల్తీ నుండి రక్షణ పొందుతారని అదనపు కలెక్టర్ కే. చంద్రా రెడ్డి అన్నారు

ప్రతి వినియోగదారుడు తన హక్కులతో పాటు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించినప్పుడే సమాజంలో జరుగుతున్న అన్యాయం, కల్తీ నుండి రక్షణ పొందుతారని అదనపు కలెక్టర్ కే. చంద్రా రెడ్డి అన్నారు.  డిసెంబర్ 24న జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని  శుక్రవారం జిల్లా పౌర సరఫరాల శాఖ  ఆధ్వర్యంలో  జరిగిన జాతీయ వినిఒయొగదారుల దినోత్సవం కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లడుతూ సమాజంలో జరుగుతున్నా కల్తీ, అన్యాయాలపై గ్రామా స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తిపై ఉందన్నారు.  ప్రతివ్యక్తి కల్తీ కి, అన్యాయానికి అలవాటు పడ్డాడని వాపోయారు.  ఏదైనా ఒక ఫంక్షన్ కు వెళితే అందరు వరుస క్రమంలో ఉంటె కొందరు అడ్డదారిలో వచ్చి నిలబడతారని వారు అతి ప్రముఖులు అని వారిని రండి అని అడ్డంగా వచ్చిన వారిని ముందు వరుసలో నిలబెడతామని అన్నారు.  ఇక్కడం మనమే అన్యాన్ని ప్రోత్సాహిస్తున్నట్లని  ఉదహరించారు.  ఇలాంటి అలవాటు నుండి ప్రతి ఒక్కరు బయట పడాలని ప్రజలను కోరారు.  ఈ సంవత్సరం వినియోగదారుల దినోత్సవాన్ని ప్లాస్టిక్ పై దాడి నినాదాన్ని ఎంచుకోవడం జరిగిందన్నారు.  ప్రజలందరూ వినియోగదారులేనని ఉదయం నుండి రాత్రి వరకు అనేక మార్గాల్లో వినియోగదారుడు మోసపోతున్నాడని పేర్కొన్నారు.  లంచం తీసుకోవడం ఎంత నేరమో ఇవ్వడము అంతే  నేరమని అన్నారు.  నేడు క్యాన్సర్ వ్యాధితో అనేక మంది బాధ పడుతూ ప్రాణాలు పోగొట్టుకున్టున్నారని అసలు క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణం కల్తీ అని తెలిపారు. ప్రతి వస్తువు కల్తీ అవుతుందని, నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదన్నారు.  ప్రతి వినియోగదారుడు తనకు అన్యాయం జరిగినప్పుడు సంబంధిత జిల్లా పౌర సరఫరాల అధికారికి ఫిర్యాదు చేయాలని సూచించారు.  ఎ వస్తువు తీసుకున్న రసీదు తప్పకుండ తీసుకోవాలని, నాణ్యత లేకున్నా, గరిష్ట ధర కన్నా ఎక్కువ ధరకు విక్రయించినా  నిలదీయాలని, కేసులు నమోదు చేయించాలని సూచించారు.   ఆధునిక యుగంలో హైటెక్కు మోసాలు జరుగుచున్నాయని అల్లాంటి మోసాలకు పాల్పడే వారిపై ఫిర్యాదులు చేసి మరొకరికి అన్యాయం జరుగకుండా కాపాడాలన్నారు. ప్రతివ్యక్తి తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని ఎవరూ మోసపోకుండా చూడాల్సిన బాధ్యత వినియోగదారుల ఫోరం సభ్యులపై ఉంటుందన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న పౌర సరఫరాల అధికారి, వినియోగదారుల ఫోరం జిల్లా, మండల అధ్యక్షులు సైతం మాట్లాడారు.  సమాజంలో జరుగుచున్న వివిధ రకాల మోసాలు, వినియోగదారుల హక్కులపై మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి శివప్రసాద్ రెడ్డి, జడ్పి సి.ఇ.ఓ సిద్ధిరామప్ప, ఆర్దిఒ వెంకటేశ్వర్లు, సివిల్ సప్లయ్ శాఖ  జిల్లా మేనేజర్ హతిరాం నాయక్, జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షులు బాలరాజు, ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఖజమ్మ, బి.సి. సంక్షేమ శాఖ అధికారి కృష్ణమాచారి, ఫోరం మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post