పత్రికా ప్రకటన తేది: 6- 9- 2021
జోగులాంబ గద్వాల
ప్రతి సోమవారం ప్రజల నుండి వచ్చిన ప్రజావాణి ఫిర్యాదులను పెండింగ్ లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి జిల్లా అధికారులకు ఆదేశించారు.
సోమవారం జిల్లా కల్లెక్టరేట్ సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఇదివరకు జిల్లాలోని అనేక ప్రాంతాల నుండి వచ్చిన ప్రజా ఫిర్యాదులు పెండింగ్లో ఉన్నాయని ,వాటిని 15 రోజుల లోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా భూములు, ఎస్సీ ఎస్టీ, హెచ్ ఆర్ సి, లోకాయుక్త,, ఆసరా పింఛన్లు తదితర అంశాలపై వచ్చిన ఫిర్యాదులను సంబందిత శాఖల అధికారులు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఫిర్యాదుదారులకు ఎండార్స్మెంట్ అందజేయాలని, మీ పరిధిలో సమస్య పరిష్కరించేలా ఉంటే వెంటనే పరిష్కరించాలని, సమస్య పరిష్కారం కానీ యెడల కొంత టైం పడుతుంది అని చెప్పాలని అన్నారు. మీ శాఖ నుండి క్లియర్ చేసిన రిపోర్ట్ ను కల్లెక్టరేట్ కు సబ్మిట్ చేయాలనీ ఆదేశించారు. వర్షాకాలం పూర్తయ్యేలోపు హరితహారంలో బాగంగా జిల్లాకు ఉన్న టార్గెట్ ను పూర్తి చేయాలనీ అధికారులకు ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు రఘురాం శర్మ, శ్రీహర్ష జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
——————————————————————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాల చే జారీ చేయడం అయినది.

