ప్రతీ ఒక్కరు కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలన్న జిల్లా కలెక్టర్ B.గోపి

వ్యాక్సినేషన్ వంద శాతం కావాలి :::జిల్లా కలెక్టర్ గోపి

ప్రతీ ఒక్కరు కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని జిల్లా కలెక్టర్ గోపి అన్నారు.

సోమవారం గ్రీవెన్స్ సందర్బంగా ప్రజల నుంచి వినతులను స్వీకరించిన అనంతరం వివిధ శాఖలకు సంబందించిన జిల్లా స్థాయి అధికారులతో కలెక్టర్ కరోనా వ్యాక్సినేషన్ పైన రివ్యూ చేశారు

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లో వంద శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి అవ్వాలన్నారు.. ఇందుకోసం ప్రతీ జిల్లా అధికారి కృషి చేయాలన్నారు.

వారి వారి పరిధిలో ఉన్న సిబ్బంది ద్వారా ప్రతీ గ్రామం లో ఇంకా వ్యాక్సినేషన్ కానీ కుటుంబాలను గుర్తించాలన్నారు

ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ వేసుకోవాలని.. లేని యెడల వ్యాక్సిన్ వేసుకోని వ్యక్తి ఒకవేళ కరోనా బారిన పడి …తగు జాగ్రత్త లు పాటించకపోతే తద్వారా ఆ గ్రామంలో వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉంటాయన్నారు

అందరూ వ్యాక్సిన్ వేయించుకున్నట్లయితే కరోనా వైరస్ వ్యాప్తి ని నివారించవచ్చన్నారు .

వ్యాక్సిన్ వేసుకున్న తరవాత ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లు ఉండవన్నారు…జిల్లా లో ఇంతవరకు వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఎవరూ ఇబ్బంది పడలేదన్నారు.
ప్రజలు ఎలాంటి అపోహలకు గురి కాకుండా… వ్యాక్సిన్ వేసుకొని ఆరోగ్యం గా ఉండాలని కలెక్టర్ తెలిపారు.

ఈ అంశాల పైన వివిధ శాఖల అధికారులు గ్రామ స్థాయిలో తమ శాఖ సిబ్బందీ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

గ్రామాలలో ఎక్కడెక్కడ వ్యాక్సినేషన్ టీం వెళ్తుందో ముందు రోజే మండల స్పెషల్ అధికారులకు, ప్రజలకి తెలపాలిసింది గా dmho ని కలెక్టర్ ఆదేశించారు.

ఈనాటి గ్రీవెన్స్ కి 55 దరఖాస్తులు వచ్చాయి.

గ్రీవెన్స్ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ గోపి తో పాటు అడిషినల్ కలెక్టర్ హరి సింగ్, drdo pd, dmho, zp ceo ,వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Share This Post