ప్రచురునార్ధం
వరంగల్
ప్రతీ గ్రామం లో
పండుగ వాతావరణం లో దశాబ్ది ఉత్సవాలు జరగాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు
జూన్ 2 వ తేదీ నుండి 22 వరకు జరిగే రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్బంగా వివిధ శాఖలకు చెందిన గ్రామ, మండల జిల్లా స్థాయి అధికారులు ఏ రోజు ఎలా కార్యక్రమాలను నిర్వహించాలి అనే అంశం పైన సోమవారం కలెక్టర్ వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికారులకి తెలియజేసారు
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి గ్రామం లో, మండలంలో లోగో,ఫ్లెక్సీ, బ్యానర్, కట్ అవుట్ లతో రాష్ట్ర అవుతరణ ఉత్సవాల నేపథ్యం ప్రజలకు తెలియాలన్నారు
టీం స్పిరిట్ తో అన్నీ శాఖల అధికారులు పని చేయాలన్నారు
జూన్ 1 వ తేదీ ముందు రోజు నుంచే అన్నీ gp, మండలంలోని అన్నీ ప్రభుత్వ కార్యాలయాలు, జిల్లా స్థాయి కార్యాలయాలు విద్యుత్ దీపాలతో వెలిగి పోవాలన్నారు
గ్రామ, మండల స్థాయి నుంచి రోజు వారి ప్రతీ కార్యక్రమం డాకుమెంటేషన్ జరగాలన్నారు
ఏ రోజు అయితే ప్రోగ్రాం ఉంటుందో సంబంధిత అధికారులు ముందు రోజే ఆయా లొకేషన్ లను విజిట్ చేసి ఆరెంజ్మెంట్స్ చూసుకోవాలన్నారు
జూన్ 2 నుండి 22 వరకు ఆయా శాఖ లు చేయాలిసిన కార్యక్రమాల పైన ప్రభుత్వం నిర్దేశించిన విధంగా పక్కాగా నిర్వహించాలన్నారు
నియోజకవర్గం వారీగా నోడల్ అధికారులని నియమించినట్లు కలెక్టర్ తెలిపారు
ప్రతీ ఊరి ఎంట్రన్స్ లో దశాబ్ది ఉత్సవాల ఫ్లెక్సీ ఉండాలని…
పబ్లిక్ మొబైలైజేషన్ చూసుకోవాలని..
ప్రతీ కార్యక్రమం విజయవంతం గా జరిగేలా గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికారులు సమన్వయము చేసుకోవాలని కలెక్టర్ సూచించారు
ఈ vc లో అదనపు కలెక్టర్ లు అశ్విని తానాజీ వాకాడే, శ్రీ వాత్స, వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు