ప్రతీ రోజూ చెత్త సేకరణ చేసి తడి పొడి చెత్త గా వేరు చేసి డంపింగ్ యార్డ్ లకు తరలించాలన్న వరంగల్ కలెక్టర్ బి .గోపి

ప్రతీ రోజూ చెత్త సేకరణ చేసి తడి పొడి చెత్త గా వేరు చేసి డంపింగ్ యార్డ్ లకు తరలించాలని వరంగల్ కలెక్టర్ బి గోపి తెలిపారు.

మంగళవారం వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట మండలం లో గల ఉప్పర పల్లి గ్రామంలో కలెక్టర్ ఆకస్మికంగా పర్యటించారు.
గ్రామంలో ఏర్పాటు చేస్తున్న బృహత్ పల్లె పకృతి వనాన్ని కలెక్టర్ పరిశీలించారు.

నర్సరీ నుంచి మొక్కలను తెప్పించి ఆహ్లాద వాతావరణం కనిపించేలా ఒక క్రమ పద్దతిలో నాటాలని కలెక్టర్ అన్నారు .

అనంతరం డంపింగ్ యార్డ్ పరిశీలించి , గ్రామాలలోని ప్రతి ఇంటికి పంచాయతీ సిబ్బంది తిరిగి తడి పొడి చెత్తను సేకరించి తప్పకుండా డంపింగ్ యార్డ్ తరలించారని పారిశుద్ధ్య సిబ్బంది ని ఆదేశించారు.

డంపింగ్ యార్డులను వినియోగంలోకి తేవాలని కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ బీ హార్ సింగ్, మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post