ప్రత్యామ్నాయ పంటలపై తన దృష్టి పెట్టాలి: కలెక్టర్ గోపి.

యాసంగి లో ఎ ఫ్సి ఐ వరి కొనుగోలు చేయమని స్పష్టం చేసినందున కొనుగోలు కేంద్రాలు ఉండవని జిల్లా కలెక్టర్ వి గోపి తెలిపారు. సోమవారం గీసుకొండ, పర్వతగిరి లో ప్రత్యామ్నాయ పంటల అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ హాజరై రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను తెలియజేశారు. తెలంగాణలో యాసంగి వరి పంటను ఎఫ్సీఐ కొనుగోలు చేయమని తెలియజేసినందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ఉండదని రైతులు దృష్టిపెట్టాల్సిన అవశ్యకత పై రైతులకు కలెక్టర్ వివరించారు. రైస్ మిల్లర్ల తో విత్తన కంపెనీలతో ఒప్పందం ఉన్న రైతులు అలాగే ఇంటి అవసరాలకు వినియోగించుకుని రైతులు, మాత్రమే వరి సాగు చేసుకోవచ్చని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల పైన ఆధారపడి రైతులు ఇతర పంటల సాగుకు తప్పకుండా కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయ పంటల లో కూడా మంచి డిమాండ్ ఉన్న పంటలు ఎన్నో ఉన్నాయని కలెక్టర్ అన్నారు. ఈ సమావేశంలో జె.డి అగ్రికల్చరల్ ఉషా దయాల్, జాతీయ ఆహార భద్రత మిషన్ కన్సల్టెంట్ సారంగం, మండల తాసిల్దార్ ఏవో ప్రజాప్రతినిధులు రైతులు
పాల్గొన్నారు.

Share This Post