ప్రచురణార్థం
ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలి…
మహబూబాబాద్ డిసెంబర్ 6.
రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ శశాంక కోరారు.
సోమవారం మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని మూడవ వార్డు అనంతారం గ్రామంలో ప్రత్యామ్నాయ పంటలపై రైతులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత ఆహార సంస్థ తెలంగాణ రాష్ట్రంలో పండించే యాసంగి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయమని తేల్చిచెప్పినందున యాసంగి ధాన్యం కు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదన్నారు. అందువలన రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు వేసుకోవాలని సూచించారు.
జిల్లా ఉద్యాన శాఖ అధికారి మాట్లాడుతూ పట్టణానికి దగ్గరగా ఉన్నందున కూరగాయల పెంపకానికి అనువుగా ఉంటుందని వరి పంటకి దీటుగా కూరగాయల మార్కెట్ వుందని తెలియజేశారు.
జిల్లాలోని నర్సింహులపేట మండలం బొజ్జన్న పేట గ్రామంలో కూరకాయలు పండిస్తూ అధిక ఆదాయం పొందుతున్నట్లు తెలియజేశారు. ప్రభుత్వం అర్హులైన రైతులకు కు బీర కాకర వంటి పంటలకు పందిరికి ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని అలాగే ఈజీఎస్ ద్వారా నిధులు మంజూరు అవుతాయని డ్రిప్ వంటి పరికరాలను సబ్సిడీ ద్వారా సమకూర్చుకోవచ్చు అని తెలియజెప్పారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి చత్రు నాయక్ ఉద్యాన శాఖ అధికారి సూర్యనారాయణ, తాసిల్దార్ రంజిత్ ఇతర మండల అధికారులు తిరుపతి రెడ్డి విష్ణు ఇతరులు పాల్గొన్నారు
————————————————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది