ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలి :: రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్

ప్రచురణార్థం-1 తేది.27.11.2021
ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలి :: రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్
యాసంగిలో బాయిల్డ్ రైస్ కోనుగోలు చేయమని స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం మరియు ఎఫ్.సి.ఐ
వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తెలంగాణ లో యాసంగి లో వరి సాగు చేయరాదు
రైతులు తమ సోంత పూచీకత్తు పై మాత్రమే వరి సాగు చేయాలి
పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి
వానాకాలం పంట పూర్తి స్థాయిలో కోనుగోలు
ధాన్యం దళారుల పై కఠినంగా వ్యవహరించాలి
ధాన్యం కొనుగోలు, పంటల మా‌ర్పిడీ వంటి అంశాల పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎస్
జగిత్యాల,నవంబర్ 27:-

ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలి :: రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్

రాబోయే యాసంగి సీజన్ లో వరి పంట సాగు నివారిస్తూ ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా రైతులు దృష్టి సారించేలా కృషి చేయాలని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వానాకాలం ధాన్యం కొనుగోలు, యాసంగి పంట మార్పిడి మరియు ప్రణాళిక వంటి అంశాల పై శనివారం అన్ని జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రం నుంచి 1 కేజీ బాయిల్డ్ రైస్ కోనుగోలు చేయమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని సీఎస్ తెలిపారు. రాష్ట్రంలో ఉన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా యాసంగి వరి పంట బాయిల్డ్ రైస్ మాత్రమే తయారవుతుందని, కేంద్ర ప్రభుత్వం మరియు ఎఫ్.సి.ఐ బాయిల్డ్ రైస్ కోనుగోలు నిరాకరిస్తున్న నేపథ్యంలో వరి పంట సాగు శ్రేయస్కరం కాదని సీఎస్ పేర్కొన్నారు. యాసంగి సీజన్ లో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసే దిశగా రైతు వేదికలో వెంటనే పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వ్యవసాయ శాఖ అధికారులను సీఎస్ ఆదేశించారు.
రైతు యాసంగి సీజన్లో తన సోంత అవసరాలకు, విత్తన కంపెనీలు, మిల్లర్లతో ఒప్పందం ఉంటే సోంత పూచికత్తు పై మాత్రమే వరి సాగు చేయాలని, ఈ సమాచారం వెంటనే క్షేత్ర స్థాయిలో రైతులకు తెలియజేయాలని సీఎస్ తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ప్రత్యామ్నాయ పంటల సాగు పై అవగాహన కల్పించాలని తెలిపారు. అనంతరం సీఎస్ వానాకాలం వరి సాగు పై చర్చించారు. జిల్లాలో పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని, అవసరమైన ప్రదేశాల్లో అదనపు కోనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ఆయన ఆదేశించారు.
జిల్లాలో వీలైనంత త్వరగా వానాకాలం వరి కోనుగోలు లక్ష్యాలను పూర్తి చేయాలని సీఎస్ సూచించారు. వానాకాలం పంట కోనుగోలు పై దృష్టి సారించాలని, ప్రతి మండలానికి సీనియర్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని, అవసరమైన స్థాయిలో గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు అధికంగా పెండింగ్ లో ఉన్న మండలాల్లో కలెక్టర్ వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సీఎస్ ఆదేశించారు.
జిల్లాలో పెండింగ్లో ఉన్న మిల్లింగ్ రైస్ లక్ష్యాలు పూర్తి చేయాలని సీఎస్ సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజు 40 వేల మెట్రిక్ టన్నుల రైస్ ఉత్పత్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సూర్యాపేట నల్గొండ సిద్దిపేట మెదక్ జగిత్యాల నిజామాబాద్ కామారెడ్డి కరీంనగర్ జిల్లాలో అధికంగా మిల్లింగ్ రైస్ పెండింగ్ ఉందని వీరు ప్రత్యేక దృష్టి సారించాలని సీఎస్ పేర్కొన్నారు. మన రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాల వద్ద దళారులు సైతం ధాన్యం విక్రయిస్తున్నట్లు సమాచారం వస్తుందని, దీనిని పూర్తి స్థాయిలో నివారించాలని తెలిపారు. ధాన్యం దళారుల పై నిఘా ఏర్పాటు చేయాలని, చెక్పోస్టులను అప్రమత్తం చేయాలని డిజిపి పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ జి.రవి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 2లక్షల 86వేల 357 ఎకరాలలో 5 లక్షల మెట్రిక్ టన్నుల వరిదాన్యం సాగు దిగుబడి అంచనా వేయడం జరిగింది. దాన్యం కొనుగోలుకు ఐకేపి, పిఏసిఎస్ మరియు ఎయంసి లద్వారా 409 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించుకోగా 404 కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 221 కోట్ల విలువ గల 1లక్షా 12వేల 838 మెట్రిక్ టన్నుల వరి దాన్యం కోనుగోళ్లను జరిపి, 99వేల 964 మెట్రిక్ టన్నుల దాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించడం జరిగిందని పేర్కోన్నారు. కొనుగోలు చేసిన వరిదాన్యానికి గాను గన్నిసంచులను అవసరం మేరకు అందుబాటులో ఉంచుకోవడం జరిగిందని, రైస్ మిల్లులో దాన్యం నిలువకు అవసరమైన స్థలం అందుబాటులో లేక పోవడం,వాతావరణంలో సంబవించే మార్పుల కారణంగా దాన్యంలో తేమశాతం తక్కువగా ఉండడం వలన కోనుగోలు ప్రక్రియ కొంతమేర అలస్యమవుతుందని తెలిపారు.
ఎస్ పి సింధు శర్మ , ఆర్.డి.ఓ.మాధురి, జిల్లా వ్యవసాయ అధికారి , జిల్లా మార్కెటింగ్ అధికారి , జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి , జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ , సంబంధిత అధికారులు తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గోన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి జగిత్యాల చేజారి చేయనైనది.

Share This Post