ప్రత్యాహ్నమయ పంటల సాగు ఆవశ్యకత పై అవగాహన :: రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్

ప్రచురణార్థం —-2 తేదీ.27.12.2021

ప్రత్యాహ్నమయ పంటల సాగు ఆవశ్యకత పై అవగాహన :: రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్

• రైతులు పండించిన ధాన్యం పూర్తి స్థాయిలో కేంద్రం కోనుగొలు చేయాలని ఏకగ్రీవ తీర్మానం

• తెలంగాణ రైతాంగం పై కక్షపూర్వకంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం

• మిషన్ భగీరథ పెండింగ్ పనులు పూర్తి చేయాలి

• డిసెంబర్ 28 నుంచి యాసంగి విడత రైతు బంధు నిధుల విడుదల

• రైతు బంధు, రైతు భీమా వంటి సంక్షేమ పథకాలు అమలు

• డిసెంబర్ 31 వరకు పూర్తి స్థాయిలో పెండింగ్ సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ పూర్తి

• కరోనా ద్వారా మరణించిన వారికి రూ.50 వేల ఆర్థిక సహయం అందజేత

• స్థానిక మిని పద్మనాయక కళ్యాణమండపంలో నిర్వహించిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో పాల్గోన్న రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి

జగిత్యాల , డిసెంబర్ 27 ప్రత్యాహ్నమయ పంటల సాగు ఆవశ్యకత పై రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక మిని పద్మనాయక కళ్యాణమండపం లో జడ్పీ చైర్ పర్సన్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లాప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి పాల్గోన్నారు. కేంద్ర ప్రభుత్వం గతంలో ఎన్నడు లేని విధంగా ధాన్యం కోనుగొలు నిరాకరించినప్పటికి సీఎం కేసిఆర్ రైతులు నష్టపోవద్దనే ఉద్దేశ్యంతో వానాకాలం పంట పూర్తి స్థాయిలో కొనుగొలు చేసారని మంత్రి తెలిపారు.

రైతులకు అండగా ఉండే విధంగా వానాకాలం పంట కోసం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ,రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేసామని మంత్రి తెలిపారు. యాసంగిలో కేంద్ర ప్రభుత్వం మరియు ఎప్.సి.ఐ ధాన్యం కొనుగొలుకు నిరాకరించిన నేపథ్యంలో ప్రత్యాహ్నమయ పంట సాగు దిశగా పయనించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని మంత్రి తెలిపారు. రైతుల పక్షాన స్వయంగా సీఎం కేసిఆర్ ధర్నా చేసినప్పటటికి కేంద్ర రైతు వ్యతిరేక వైఖరిలో మార్పు రావడం లేదని మంత్రి తెలిపారు.

రైతు సంక్షేమం దిశగా దేశంలో ఎవరు అమలు చేయని పథకాలను సీఎం కేసిఆర్ అమలు చేస్తున్నారని, ప్రతి ఎకరానికి రూ.5వేల పంట పెట్టుబడి సాయం రెండు విడుతలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. రైతు సంక్షేమం దిశగా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని , గత వానాకాలం పంటలో 2.15 లక్షల మంది రైతులకు 210.92 కోట్ల రైతు బంధు నిధులు జమ చేసామని, డిసెంబర్ 28 నుంచి యాసంగి పంటకు సంబందించి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 60 లక్షల పైగా రైతులకు రూ.7500 కోట్ల రైతు బంధు సాయం అందించేందుకు నిధులను సీఎం కేసిఆర్ సిద్దం చేసారని మంత్రి తెలిపారు.

రైతు భీమా పధకం కింద రైతు మరణించిన 10 రోజులో రూ.5 లక్షల సాయం అందిస్తున్నామని తెలిపారు. జగిత్యాల జిల్లాలో 134098 మందికి రైతు భీమా కింద నమోదు చేసామని, దురదృష్టవశాతు మరణించిన 2359 మంది రైతులకు రూ.116.4 కోట్లు అందించామని మంత్రి అన్నారు. జిల్లాలో 71 వ్యవసాయ క్లస్టర్లలో రైతు వేదికలు నిర్మించామని, వాటిలో పంట మార్పిడి అంశం పై 899 అవగాహన సమావేశాలు నిర్వహించామని అధికారులు వివరించారు. మిషన్ భగీరథ కింద జిల్లాలోని 491 గ్రామాలకు గాను 473 గ్రామాలో స్థిరికరణ ధృవీకరణ పూర్తయిందని, పట్టణంలో సైతం పనులు చివరికి వచ్చాయని అధికారులు తెలిపారు.

మిషన్ భగీరథ అంశం పై ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయాలని మంత్రి కలెక్టర్ కు సూచించారు.మిషన్ భగీరథ పనులు పూర్తి స్థాయిలో జగిత్యాల జిల్లాలో పూర్తి చెసేందుకు అవసరమైన అదనపు నిధులు, అదనపు పనుల పై నివేదిక తయారు చేసి వెంటనే అందించాలని కలెక్టర్ కు మంత్రి ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి 2 డోసుల కరోనా వ్యాక్సినేషన్ అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. జగిత్యాల జిల్లాలో 7.57లక్షల మందికి వ్యాక్సినేషన్ అందించాల్సి ఉండగా 100% మొదటి డోస్, 60% రెండో డోస్ వ్యాక్సినేషన్ పూర్తి చేసామని అదికారులు వివరించారు.

డిసెంబర్ 31 వరకు పెండింగ్ సెకండ్ డోస్ వ్యాక్సినేషన్లు పూర్తి చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. జిల్లాలో 25 పల్లెదవాఖానాలు, 53 వైద్యుల పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసిందని, ప్రస్తుతం 8 మంది వైద్యులను నియమించామని కలెక్టర్ తెలిపారు. ఆసక్తి కల్గిన ఎంబిబిఎస్ వైద్యులు దరఖాస్తు చెసుకుంటే వెంటనే నియమిస్తామని కలక్టర్ తెలిపారు. కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.50వేల ఆర్థిక సహయం అందజేస్తుందని, దీని కోసం అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని మంత్రి తెలిపారు.

అనంతరం ఎస్సి స్వయం ఉపాధి రుణాల పై చర్చించారు. రూ.48.9 కోట్ల సబ్సీడితో ప్రత్యేకంగా జిల్లాకు 1890 ఎస్సి యూనిట్లను ప్రభుత్వం మంజూరు చేసిందని, ప్రబుత్వం సబ్సీడి నిధులు విడుదల చేసిన వెంటనే వాటిని గ్రౌండ్ చేసే దిశగా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. అనంతరం పశుసంవర్థక శాఖ, మత్స్య, విద్యా, విద్యుత్ శాఖల పై సమావేశంలో చర్చించారు.

సమావేశంలో పాల్గొన్న జెడ్పీచైర్ పర్సన్ దావా వసంతి మాట్లాడుతూ స్థానిక ప్రజాప్రతినిధులు సమావేశం దృష్టికి తీసుకువచ్చిన సమస్యలకు అదికారులు పరిష్కారం చూపి, వాటికి సంబంధించిన సమాచారం ప్రజాప్రతినిధులకు అందజేయాలని సూచించారు. రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు భీమా వంటి సంక్షేమ పథకాలు, కాళేశ్వరం లాంటి భారీ ఎత్తిపోతల పథకం నిర్మాణం ద్వారా సాగు నీరు అందుబాటులోకి తెచ్చామని, కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానంతో రైతులు పండించిన ధాన్యం కొనుగొలు చేయడం లేదని ఆమె విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో రైతులు పండించిన ధాన్యం కోనుగొలు చేయాలని జడ్పీ సర్వసభ్య సమావెశం ఏకగ్రీవ తీర్మానం జారీ చేసిందని ఆమె తెలిపారు. ప్రభుత్వంలో వివిధ శాఖలో ప్రారంభమయ్యే వివిధ నూతన ప్రభుత్వ పథకాల పై అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం అందిస్తే ప్రజలలో మరింత అవగాహన కల్పించే అవకశాం ఉంటుందని తెలిపారు.

సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ జి. రవి మాట్లాడుతూ జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి రెండు డోసుల వ్యాక్సినేషన్ అందించాలని తెలిపారు. జిల్లాలో ఫిర్యాదులు అందిన రైస్ మిల్లుల పై విచారణ జరుపుతున్నామని, ఇప్పటికే 4 రైస్ మిల్లుల పై జరిమానా విధించామని, పూర్తి స్థాయి విచారణ పూర్తి చేసిన తరువాత వివరాలు అందిస్తామని కలెక్టర్ తెలిపారు. గత వానాకాలం జిల్లాలో 2.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగొలు చేస్తే ప్రస్తుతం జిల్లాలో 421 కోనుగొలు కేంద్రాలు ఏర్పాటు చేసి వానాకాలం పంట 3.85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కోనుగొలు చేసామని కలెక్టర్ తెలిపారు.

జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ , కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, చొప్పదండి ఎమ్మేల్యే సుంకె రవిశంకర్, డి.సి.ఎం.ఎస్. చర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, జడ్పీ సీఈఓ సుందరవరద రాజన్ , జిల్లా అధికారులు జెడ్పీటీసీలు, ఎంపీపీలు ,సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు ,తదితరులు, ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ప్రత్యాహ్నమయ పంటల సాగు ఆవశ్యకత పై అవగాహన :: రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్

జిల్లా పౌర సంబంధాల అధికారి జగిత్యాలచే జారీ చేయనైనది

Share This Post