పత్రికాప్రకటన తేదిః 24-09-2021
ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని పకడ్బందిగా నిర్వహించాలని :: జిల్లా కలెక్టర్ జి. రవి
జగిత్యాల, సెప్టెంబర్ 24: జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితాను పకడ్బందిగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వివిధ రెవెన్యూ సంబంధిత అంశాలపై ఆర్డిఓలు, తహసీల్దార్లు, పర్యవేక్షకులు, ఎలక్షన్ డిటిలతో జూమ్ వెబ్ కాన్ఫరెన్స్ ద్వారా సమక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో గ్రామం, మండలం వారిగా క్షేత్రస్థాయిలో అధికారులు పర్యవేక్షించి చనిపోయిన ఓటరు ను గుర్తించి వారి వివరాలను ఓటరు జాబితా నుండి తొలగించాలని, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి పేర్లను తొలగించే ముందు వారి కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చి వారం రోజుల గడువు తర్వాత పేర్లను తొలగించాలని, జాబితాలో ఫోటో తప్పుగా నమోదు అయిన వాటిపై చర్యలుతీసుకోవాలని అన్నారు. గరుడ, ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ల డౌన్ లోడ్ పై బిఎల్ఓలకు అవగాహన కల్పించి, యాప్ నిర్వహణపై శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఎపిక్ కార్డు ల డౌన్ లోడ్ చేయాలని, కొత్తగా ఓటర్ నమోదయ్యేందుకు సమర్పించిన ఫారాలను సరి చూసుకోవాలని, స్పెషల్ సమ్మరి రివిజన్ పై వచ్చే ఆదేశాలను పాటించాలని సూచించారు.
కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ ధరఖాస్తులలో మండలం వారిగా కోత్తగా వచ్చిన, పెండింగ్ ధరఖాస్తులను పరిశీలించి సరిగా ఉన్న వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, ఎమ్మెల్యే ల వద్దకు పంపిన ధరఖాస్తులను పై చర్యలు తీసుకోని, బడ్జెట్ వారిగా లబ్దిదారులకు అందించేలా చర్యలు తీసుకోవాలని పేర్కోన్నారు. ప్రజావాణి ద్వారా వచ్చిన ధరఖాస్తులపై తీసుకున్న చర్యలను తెలియజేయాలని, ధరణీ స్లాట్ పెండింగ్ ధరఖాస్తులపై చర్యలు తీసుకోవాలని, మ్యూటేషన్ పెండింగ్ లపై చర్యలు తీసుకోవాలని, పిఓబి, దరణీ లో వచ్చిన మార్పులను ఎప్పటికప్పడు తెలుసుకుంటు, సమస్యలను పరిష్కరించాలని, మండలం, గ్రామం వారిగా దరణీ లో పట్టాదారు పేరు కాకుండా ఇళ్లస్థలాలు అని తప్పుగా నమోదైన వాటిపై చర్యలుతీసుకోవాలని, ఇళ్ల స్థలాలుగా నమోదైన వారికి తెలియజేసి సమస్యలను పరిష్కారిని ధరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఈ ఆఫీస్ ఫైళ్లపై తీసుకునే చర్యలు తీసుకోవాలని, బదిలి అయిన అధికారులు ఈ ఆఫీస్ లాగిన్ వివరాలు అధికారికి అందించాలని, 1 నుండి 7వ విడతలలో భూపంపిణి కార్యక్రమం ద్వారా లబ్దిదారులకు భూముల పట్టాలు జారిచేసి, స్థలాన్ని చూపించని వారికి మోకా చూపించాలని అన్నారు. TSBPASS ద్వారా నిర్మాణాలకు అనుమతులకు విరుద్దంగా చేపడుతున్న అక్రమకట్టడాలు జరుగకుండా ప్రత్యేక బృందాల ద్వారా సైట్ వెరిఫికేషన్ చేయించాలని, ప్రతి ధరఖాస్తును పరిశీలించి, నిర్మాణ దశలోనే అక్రమ నిర్మాణాలు జరుగకండా చర్యలు తీసుకోవాలని తద్వారా ఎవరికి కూడా ఎక్కవ ఆస్థినష్టం కలుగకుండా నివారించగలుగుతామని పేర్కోన్నారు. ప్రజాప్రతినిధులు, ప్రజలను అవగాహన కల్పించాలని, గ్రామపంచాయితి, మున్సిపాలిటిలలో అనుమతులు మీరి నిర్మాణాలు జరిగే వాటిపై తీసుకున్న చర్యలను గురించి తెలియజేయాలని, ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించాలని సూచించారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాల చే జారిచేయనైనది.