ప్రత్యేక ఓటరు నమోదు పెండింగ్ ఫారాలు, ఎపిక్ కార్డులు, స్వీప్ కార్యక్రమాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, అదనపు కలెక్టర్లు గరిమ అగర్వాల్, శ్యామ్ ప్రసాద్ లాల్, ట్రైని కలెక్టర్ మయాంక్ మిట్టల్, జిల్లా పరిషత్ సీఈవో ప్రియాంక తదితరులు.

ఓటర్ జాబితాలను అప్డేట్ చేయాలి

జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

00000

ఓటరు జాబితాలను అప్డేట్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ ఏఈఆర్ఓ, ఈఆర్ఓ లను ఆదేశించారు.

శనివారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రత్యేక ఓటరు నమోదు పెండింగ్ ఫారాలు, ఎపిక్ కార్డులు, స్వీప్ కార్యక్రమాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటర్ జాబితా లో ఎలాంటి తప్పిదాలు లేకుండా సిద్ధం చేయాలని కలెక్టర్ లను ఆదేశించారు. అదేవిధంగా కొత్తగా ఓటరుగా నమోదు అయ్యేందుకు సమర్పించిన ఫారాలు మార్పులు,చేర్పులు సంబంధించిన పత్రాలను పరిశీలించి చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలని, ఈవీఎంలను రాజకీయ పార్టీల అభ్యర్థుల సమక్షంలో తనిఖీలు నిర్వహించి సిద్ధంగా ఉంచుకోవాలని ఆయన కలెక్టర్లను ఆదేశించారు.

జిల్లా కలెక్టర్ ఆర్ వి. కర్ణన్
ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో పరిపూర్ణమైన ఓటర్ జాబితా సిద్ధం చేయడానికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. జిల్లాలో ఓటర్ల నమోదు మార్పులు, చేర్పులు, సవరణలకు సంబంధించిన ఫారాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అనంతరం జిల్లా కలెక్టర్ తహసీల్దార్లు డిప్యూటీ తహసీల్దార్లతో కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో సమావేశం నిర్వహించి తగు సూచనలు చేశారు. ఓటర్ జాబితాలను పరిశీలించి మరణించిన వారి పేర్లను, ఇతర గ్రామాలకు వలస వెళ్లిన వారి పేర్లను, ఇతర కారణాలతో తొలగించే ముందు కుటుంబ సభ్యులకు నోటీసు ఇచ్చి పేర్లను తొలగించి జాబితాలు సిద్ధం చేయాలని ఈ ఆర్ ఒ ( తహసీల్దార్లను )లను కలెక్టర్ ఆదేశించారు. ముందుగా హుజురాబాద్ నియోజకవర్గం లో ఓటర్ జాబితా వేగవంతంగా అప్డేట్ చేయాలని తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాల్లో, మున్సిపల్ పరిధిలో ఓటర్ జాబితాలను క్రమబద్ధీకరించాలని కలెక్టర్ తెలిపారు. ఎన్నికలకు సంబంధించి ప్రతి మంగళవారం తహసిల్దార్ లతో సమీక్షా సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ జీవి శ్యాం ప్రసాద్ లాల్, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, జడ్పీ సీఈఓ ప్రియాంక, కరీంనగర్ ఆర్డిఓ ఆనంద్ కుమార్, డి ఆర్ డి ఓ శ్రీలత, తహసిల్దార్ లు పాల్గొన్నారు.

Share This Post