ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం లో బాగంగా నూతనంగా ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకున్న ఓటర్లకు ఓటరు (ఎపిక్) కార్డులు అంద చేయాలని చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

పత్రిక ప్రకటన                                             తేది:12-01-2022

ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం  లో బాగంగా నూతనంగా ఓటరు జాబితాలో పేర్లు నమోదు  చేసుకున్న ఓటర్లకు ఓటరు (ఎపిక్) కార్డులు అంద చేయాలని చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్ లు, జిల్లా ఎన్నికల అధికారులతో, జాతీయ ఓటరు దినోత్సవం, నూతన ఓటరు జాబితా, తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ మాట్లాడుతూ తేదీ 25.1.2022 నాడు జాతీయ ఓటరు దినోత్సవం సందర్బంగా నూతన ఓటర్లకు ఓటర్ (ఎపిక్) కార్డు లను అందజేయాలని తెలిపారు.

జనవరి 5న తుది ఓటరు జాబితా విడుదల చేశామని, అందులో 18 సంవత్సరాల నుండి  నూతనంగా పేర్లు  నమోదు చేసుకున్న ఓటర్లకు జాతీయ ఓటరు దినోత్సవం నాడు నూతన ఓటర్ ఏపిక్ కార్డులను మరియు కిట్లను  అందజేయాలని అధికారులకు ఆదేశించారు. ఓటర్ నమోదు నిరంతర ప్రక్రియ అని , 18 సంవత్సరాలు నిండి ఓటర్ నమోదు, మార్పులు, చేర్పులు, సవరణకు వచ్చిన దరఖాస్తులు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. నూతనంగా నిర్మించి ప్రారంభించుకున్న ఈ విఎం గోదాంలలోకి ఈ వి ఎంలు (బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వి.వి.ప్యాట్లు )లను వారం లోగా తరలించాలని తెలిపారు. జాతీయ ఓటరు దినోత్సవం ను కోవిడ్ నిబంధనల ప్రకారం నిర్వహణ పై అధికారులకు పలు సూచనలు జారీ చేశారు.

వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా నుండి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, అదనపు కలెక్టర్ రఘురాం శర్మ, ఆర్.డి.ఓ రాములు, మధుసూదన్, సంబందిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

———————————————————————

జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాల ద్వారా  జారీ చేయడమైనది.

Share This Post