బుధవారం ఆయన జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నూతన ఓటర్ల నమోదు, కొత్తగా ఓటర్లుగా నమోదైన వారికి ఎపిక్ కార్డుల పంపిణీ, తదితర విషయాలపై సూచనలు చేస్తూ, ఫోటో ఓటర్ గుర్తింపు కార్డుతో పాటు ఓటర్ కిట్ కూడా జాతీయ ఓటర్ దినోత్సవం వచ్చే జనవరి 25 లోగా నూతనంగా నమోదైన ఓటర్లకు అందచేయాలని తెలిపారు. ఓటర్ కిట్ లో వ్యక్తిగత లేఖ, ఓటర్ గైడ్, ఓటర్ ప్రతిజ్ఞ, ఎపిక్ కార్డు కలిగి ఉంటుందని అన్నారు. ఓటర్ నమోదు నిరంతర ప్రక్రియ అని, 18 సం. లు నిండి ఓటర్ నమోదు, మార్పులు, చేర్పులు, సవరణకు వచ్చిన దరఖాస్తులు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్, జిల్లా ఎన్నికల సూపరిండెంట్ సాయి భుజంగరావు, అధికారులు పాల్గొన్నారు.
——————
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం కామారెడ్డి చేజారి చేయనైనది.