*ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం 2022 పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం*

నల్గొండ,అక్టోబర్ 12.జిల్లాలో చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా కార్యక్రమం సవరణ 2022 కార్యక్రమం కు సూచనలు,సలహాలు అందించి తమ సహాయ సహకారాలు అందించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను జిల్లా రెవెన్యూ అధికారి జగదీశ్వర్ రెడ్డి కోరారు.మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో  ఎన్నికల  సంఘం ఆదేశాల ననుసరించి జిల్లాలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో  సమావేశం నిర్వహించి ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం 2022 షెడ్యూల్, పోలింగ్ కేంద్రం ల చేర్పులు,మార్పులు,కొత్త పోలింగ్ కేంద్రం ల ఏర్పాటు పై వివరించారు. ఈ సమావేశం లో జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం 2022 షెడ్యూల్ వివరించి సూచనలు,సలహాలు కోరారు.జిల్లాలో మొత్తం 3 పోలింగ్ కేంద్రంల యొక్క లొకేషన్ మార్పు,కొత్తగా 6 పోలింగ్ కేంద్రం ల ఏర్పాటుకు ఓటర్ నమోదు అధికారుల ప్రతి పాదనలు సమర్పించారు.ఈ ప్రతి పాదనల పై అభ్యంతరాలు తెలుపవలసింది గా కోరారు.ఈ ప్రతి పాదనలు పై అన్ని రాజకీయ పార్టీ లు ఆమోదం తెలిపారు. ఈ సమావేశం లో  ఎన్నికల డి.టి.విజయ్, బి.పిచ్చయ్య(టి.ఆర్.ఎస్),ఎల్.శ్రావణ్ కుమార్ (సి.పి.ఐ),ఏ.సత్యనారాయణ(టి.డి.పి),జి.మోహన్ రెడ్డి ,జి.సైది రెడ్డి,(కాంగ్రెస్),బి.సాంబయ్య(బి.జె.పి),పి.నర్సిరెడ్డి (సి.పి.యం),ఖాజా గౌస్ మొహియుద్ధీన్ (యం.ఐ. యం) తదితరులు పాల్గొన్నారు.

*ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం 2022 పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం*

Share This Post