ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమంలో భాగంగా ఓటరు హెల్ప్ లైన్ యాప్ వినియోగం పై విస్తృత ప్రచారం చేపట్టాలని, ఓటర్ల సవరణ జాబితాలు వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ తెలిపారు.

ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమంలో భాగంగా ఓటరు హెల్ప్ లైన్ యాప్ వినియోగం పై విస్తృత ప్రచారం చేపట్టాలని, ఓటర్ల సవరణ జాబితాలు వేగవంతంగా పూర్తి చేయాలని   రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ తెలిపారు.

బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ అన్ని జిల్లాల కలెక్టర్లతో ఓటర్ నమోదు కార్యక్రమంలో బాగంగా  గరుడ యాప్ వినియోగం  పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా శశాంక్ గోయల్ మాట్లాడుతూ  అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు  నమోదు చేసుకునే విధంగా స్వీప్ యాక్టివిటీలు నిర్వహించాలని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటర్ గా తమ పేర్లు నమోదు చేసుకోవాలని, అర్హులైన వారందరి పేర్లను  ఫారం-6 ద్వారా కొత్త ఓటర్లుగా  నమోదు  చేసే ప్రక్రియను  నిరంతరంగా  కొనసాగించాలని సూచించారు. ఓటరు జాబితాలో తప్పులు లేకుండా ఉండేందుకు వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని , ఫారం-7 ద్వారా ఓటర్  జాబితాలో చనిపోయిన వారి పేర్లను తొలగించాలని, అదేవిధంగా ఓటర్ జాబితాలో డబుల్ ఉన్న ఓటర్ ల పేర్లను, శాశ్వతంగా వలస వెళ్ళిన వారి పేర్లను గుర్తించి తోలగించాలని అన్నారు. భారత ఎన్నికల కమిషన్ రూపొందించిన  గరుడ యాప్ వినియోగంపై ప్రజల్లో విస్త్రుత ప్రచారం చేసి ,  యాప్ వినియోగం పై వారికి పూర్తి అవగాహన కల్పించాలని అన్నారు. జిల్లాలో ఉన్న విద్యాలయాల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి ఓటు ప్రాముఖ్యత పై కార్యక్రమాలు నిర్వహించి  ఓటు నమోదు ప్రక్రియ పై అవగాహన కల్పించాలని  అధికారులకు సూచించారు.

గరుడ యాప్ వినియోగంపై బూత్ స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.  ప్రతినెల కొత్తగా వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు బి.ఎల్.ఓ ల ద్వారా పరిశీలించి , ఆన్లైన్ లో నమోదు చేయాలని సూచించారు.  జిల్లాలోని ఈవీఎం గోదాములను ప్రతి నెల  తనిఖీ చేయాలని అన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను ఎలాంటి ఆటంకాలు లేకుండా  పగడ్బందీగా  నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ను ప్రజలు సద్వినియోగం చేసుకునే విధంగా విస్తృత ప్రచారం చేయాలనీ తెలిపారు.

వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి , ఆర్.డి.ఓ రాములు, మదన్ మోహన్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

——————————————————————————

జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల్ గారి చే జారి చేయబడినది.

 

Share This Post