ప్రత్యేక ఓటురు నమోదు, సవరణ కార్యక్రమంలో భాగంగా 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరికి ఓటురుగా నమోదు చేయించాలని చీఫ్ ఎలక్ట్రాల్ అధికారి శశాంక్ గొయల్ ఆదేశించారు.

ప్రత్యేక ఓటరు నమోదు, సవరణ కార్యక్రమంలో భాగంగా 1st జనవరి, 2022 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు తమ పేరు ఓటురు జాబితాలో నమోదు చేసుకొనే విధంగా చూడాలని చీఫ్ ఎలక్టరల్ అధికారి శశాంక్ గొయల్ తెలిపారు.
శనివారం కలెక్టర్ కార్యాలయం లోని కాన్ఫరెన్స్ హాలులో ఓటర్ల నమోదు, సవరణలపై రెవిన్యూ అధికారులు, తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ, బి యల్ ఓ లతో ఇంటింటికి తిరిగి 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరిని గుర్తించి ఓటురుగా నమోదు చేయించాలన్నారు. చనిపోయిన వారిని, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి వివరాలు సేకరించి అట్టి పేర్లు జాబితాలో నుండి తొలగించాలని ఓటురు జాబితాను అప్ డేట్ చేయాలని సూచించారు. ఓటురు జాబితా తయారీలో బూత్ లెవెల్ ఆఫీసర్ల పాత్ర చాలా ముఖ్యమైనదని, అన్ని polling కేంద్రాలలో బి యల్ ఓ లు ఉండే విధంగా చూడాలన్నారు. బి యల్ ఓ లకు వారు నిర్వహించే విధుల పట్ల మరియు గరుడ యాప్ ద్వారా ఆన్ లైన్ సేవలు నిర్వహించే విధంగా ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించినప్పుడే తప్పులు లేని ఓటరు జాబితా సిద్దమౌతుందన్నారు. దరఖాస్తులన్నీ ఆన్ లైన్ ద్వారా వచ్చే విధంగా చూడాలన్నారు. హార్డ్ కాపీలుగా వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు కంప్యూటర్లో ఆన్ లైన్ చేయాలని సూచించారు.
సమావేశ అనంతరం ముఖ్య ఎలక్టరల్ అధికారి శశాంక్ గొయల్ స్థానిక సంగేమ్ లక్ష్మి బాయి, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో గల పోలింగ్ సెంటర్లలో blo ల ద్వారా నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటురు నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. ఇప్పటి వరకు కొత్తగా ఎంత మంది ఓటర్లుగా నమోదైనారని blo లను అడిగి తెలుసుకున్నారు. అందరు BLO లు తప్పనిసరిగా గరుడ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు
ఈ యాప్ వినియోగం వల్ల పనులలో పారదర్శకతతో పాటు పనులలో సౌలభ్యం కలుగుతుందన్నారు.
అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఒక కోటి రూపాయల ఖర్చుతో నిర్మించిన ఈవీఎం వివి పాడ్ స్టోరేజ్ గోడౌన్ ను జిల్లా కలెక్టర్ ఓ కలసి ప్రారంభించారు. రాష్ట్రంలో కొత్తగ ఏర్పడిన అన్ని జిల్లాలలో ఈవీఎం స్టోరేజీ గోడౌన్లు నిర్మించడం జరింగిందన్నారు. అనంతరం ఆవరణలో మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిఖిలతో పాటు, జిల్లా అదనపు కలెక్టర్లు మోతిలాల్, చంద్రయ్య, తాండూర్ RDO అశోక్ కుమార్, స్వీప్ నోడల్ ఆఫీసర్ కోటాజి, ఎంసీసీ నోడల్ ఆఫీసర్ పుష్పలత అందరు తహసీల్దార్లు పాల్గొన్నారు.

Share This Post