ప్రత్యేక ప్రణాళిక ద్వారా వ్యాక్సినేషన్లో వేగం పెంచాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

పత్రికాప్రకటన..2 తేదిః 08-12-2021
ప్రత్యేక ప్రణాళిక ద్వారా వ్యాక్సినేషన్లో వేగం పెంచాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి
జగిత్యాల, డిసెంబర్ 08: కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తిచేయడానికి ప్రత్యేకాధికారలు, ప్రోగ్రాం అధికారులు, జిల్లా వైద్యాధికారి ప్రత్యేక ప్రణాళికను రూపొందించుకొని వ్యాక్సినేషన్ లో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు. బుదవారం వైద్యాధికారలు, ప్రత్యేకాధికారులతో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఉదయం టెలికాన్ఫరెన్స్, సాయంత్రం జూమ్ వెబ్ వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు.

ప్రత్యేక ప్రణాళిక ద్వారా వ్యాక్సినేషన్లో వేగం పెంచాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా కోవిడ్ మొదటి, రెండవ డోసుల టీకాలను ఇచ్చి లక్ష్యాన్ని సాధించేలా అధికారులు కృషిచేయాలని సూచించారు. ఉదయం నుండి రాత్రి వరకు వ్యాక్సినేషన్ ప్రగతిని పరిశీలించడం జరుగుతుందని పేర్కోన్నారు. విధులు నిర్వహిస్తున్న వారికి సౌకర్యాలను కల్పించినప్పటికి, నిర్దేశించిన ప్రగతిని సాధించడంలో సిబ్బంది ఇంకా వెనకబడిపోయారని పేర్కోన్నారు. మొదటి విడత వ్యాక్సిన్ పూర్తిచేసుకొని రెండవ డోసు టీకాలను ఇవ్వాల్సిన లక్ష్యాలను డిసెంబర్ చివరి నాటికల్ల ఎట్టిపరిస్థితులలో పూర్తి చేయాలని ఆదేశించారు.
వ్యాక్సిన్ తీసుకోవాల్సిన వారిని, వ్యాక్సిన్ తీసుకోని రిజిస్ట్రేషన్ కాని వారిని గుర్తించి వివరాల నమోదు ప్రత్యేక కార్యచరణను రూపొందించుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. రెండు షిప్టుల వారిగా సిబ్బందిని నియమించాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. జిల్లా స్థాయిలో ప్రతి పిహేచ్సి వారిగా ఇచ్చిన లక్ష్యాన్ని సాధించేలా జిల్లా వైద్యాధికారి సమీక్షించాలని, ప్రతిరోజు మండలం వారిగా 1000 వ్యాక్సిన్ లను అందించాలని సూచించారు. ఇచ్చిన లక్ష్యాన్ని ఏ విధంగా సాధించాలని సమీక్షించుకోవాలని సూచించారు. వైద్య సిబ్బంది ఎవరైన విధులకు రాకపోతే అధికారులు జిల్లా వైద్యాధికారికి తెలియజేయాలని పేర్కోన్నారు. వ్యాధులను కారణంగా చూపే వారికి అవగాహన కల్పించి వ్యాక్సిన్ అందించాలని పేర్కోన్నారు. మండలంలో రైస్ మిల్లులలో పనిచేసే, ఇతర ప్రాంతాల నుండి పని నిమిత్తం వచ్చే వారిని సైతం గుర్తించి వ్యాక్సిన్ ఇవ్వాలని సూచించారు. లక్ష్యాన్ని సాధించడంలో వెనకబడిన వారు ప్రత్యేక కార్యచరణతో ముందుకు సాగాలని, ఉదయం 6 గంటలకు హజరై వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించాలని, తక్కువ ప్రగతి ఉన్న అధికారులకు శోకాజు నోటిసులు జారి చేయాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. రిజిస్ట్రేషన్ ప్రకారం ఫోర్టల్ సరిచూసుకోవాలని, మీ ప్రాంతాలలో లైన్ డిపార్ట్ మెంట్ అధికారులతో సమావేశం నిర్వహించి కళాశాల విద్యార్థులకు వ్యాక్సిన్ అందించేలా చర్యలు తీసుకోవాలని పేర్కోన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాల చే జారిచేయనైనది.

Share This Post