ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమ చైతన్యాన్ని రగిలించిన తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రధాత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్…. జిల్లా కలెక్టర్ కె శశాంక

ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమ చైతన్యాన్ని రగిలించిన తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రధాత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్…. జిల్లా కలెక్టర్ కె శశాంక

ప్రచురణార్థం

మహబూబాబాద్, ఆగస్టు 06:

ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమ చైతన్యాన్ని రగిలించిన తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రధాత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ అని జిల్లా కలెక్టర్ కె శశాంక కొనియాడారు.

శనివారం ఉదయం ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం హాల్లో జిల్లా కలెక్టర్ కె. శశాంక స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, సుదీర్ఘంగా తెలంగాణ ఆవశ్యకతను ప్రపంచానికి చాటిచెప్పిన మహోన్నత వ్యక్తి అని, తెలంగాణ ఉద్యమ శిఖరం అని, సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత అని కలెక్టర్ వారి ఉద్యమస్ఫూర్తిని, సేవలను కొనియాడారు.

తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఆయన నిలిచిపోయారని, ఉద్యమ భావజాల వ్యాప్తికి తన జీవితాన్ని అంకితం చేసిన చిరస్మరణీయ వ్యక్తి అని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే కలుగు లాభాలను తెలియజేస్తూ సమాజాన్ని చైతన్యం చేశారని, మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర వహించారని, ఉద్యమ గురువు గా పేరొందారని, యావత్ తెలంగాణ ప్రజలు యాది మరవని మహనీయుడు అని, నిస్వార్ధంగా సేవలందించిన సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ అని జిల్లా కలెక్టర్ వారి సేవలను స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా అధికారులు, ఆర్ డి ఓ కొమురయ్య, కలెక్టరేట్ ఏ. ఓ. వెంకటరమణ, పర్యవేక్షకులు, అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post