ప్రత్యేక వాక్సినేషన్ కార్యక్రమానికి ప్రజల నుండి వస్తున్న స్పందన పట్ల జిల్లా కలెక్టర్ అనుదీప్ హర్షం వ్యక్తం చేశారు.

శనివారం ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమంపై వైద్య, పంచాయతీరాజ్, మున్సిపల్ కమిషనర్లు, తహసిల్దారులు, యంపిడిఓలు, యంపిఓలతో టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 25 వేల మందికి వ్యాక్సిన్ వేశామని చెప్పారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ దిగ్విజయంగా జరుగుతున్నదని, వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రజలకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పింస్తుడడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇదే స్పూర్తితో జిల్లాలో వ్యాక్సిన్ ప్రక్రియ నూటికి నూరు శాతం పూర్తి చేయు విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. వ్యాక్సిన్ వేయించుకున్న ప్రతి ఒక్కరి వివరాలు తప్పక ఆన్లైన్ చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఆన్లైన్ చేయుటలో జాప్యాన్ని నివారించుటకు ఆయా ప్రాంతాల్లో సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వ్యక్తుల సేవలను వినియోగించుకోవాలని చెప్పారు. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని, ప్రజలు నిర్భయంగా వ్యాక్సిన్ వేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు సైతం వ్యాక్సిన్ తీసుకోవచ్చని చెప్పారు. వ్యాక్సినేషన్ కేంద్రాల్లో వైద్య సిబ్బంది కొరత లేకుండా సిబ్బందిని సర్దుబాటు చేయాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. జిల్లాకు అదనంగా ప్రభుత్వం 10 వేల వాయిల్స్ సరఫరా చేసినట్లు ఆయన వివరించారు. ఆదివారం కూడా వాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుందని ప్రజలు వ్యాక్సిన్ తీసుకోవచ్చుని చెప్పారు.

ఈ టెలి కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ శిరీష, డాక్టర్ సుజాత, డిపిఓ రమాకాంత్, మున్సిపల్ కమిషనర్లు, మండల ప్రత్యేక అధికారులు, తహసిల్దారులు, యంపిడిఓలు, యంపిఓలు తదితరులు పాల్గొన్నారు.

Share This Post