ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమంను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

పత్రికాప్రకటన తేదిః 24-09-2021
ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమంను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి
జగిత్యాల, సెప్టెంబర్ 24: జిల్లాలో 18 సంవత్సరాలు పైబడిన వారి కై ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమంను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లాలోని జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామపంచాయతీలో, ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ధర్మపురి మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో మరియు తమ్ముకుంటా ప్రైమరీ స్కూల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యాక్సినేషన్ సబ్ సెంటర్లను మరియు ధర్మపురి మండలం మగ్గిడి, ఎడపల్లి గ్రామాలలో బృహుత్ పల్లెప్రకృతి వనాలను, గాదెపల్లి గ్రామంలో ప్రభుత్వ భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని వ్యాక్సినేషన్ కేంద్రాల ద్వారా 18 సంవత్సరాలు నుండి మొదలుకొని ఆపై వారందరి కొరకు 134 పట్టణ, 140 గ్రామీణ ప్రాంతాలలో 274 ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాల ద్వారా కోవిడ్ వ్యాక్సిన్ లను అందిండచం జరుగుతుందని తెలియజేశారు. సెప్టెంబర్ 23వ తేదీ వరకు నిర్వహించిన ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ లో 1,13,666 మందికి, 24వ తేదీ వరకు నిర్వహించిన డ్రైవ్ లో దాదాపు 1,31,918 మందికి వ్యాక్సినేషన్ అందించామని తెలిపారు. గ్రామీణప్రాంతాలలో ప్రతి వ్యాక్సినేషన్ కేంద్రానికి రోజుకు 150 డోసులు, పట్టణంలోని ప్రతి వార్డులో రోజు 25 డోసులు వ్యాక్సిన్ అందిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. సబ్ సెంటర్ పరిధిలో ఉన్న గ్రామాలో షెడ్యూల్ ప్రకారం ప్రత్యేక వ్యాక్సిన్ క్యాంపులు నిర్వహిస్తామని, సదరు షెడ్యుల్ కు సంబంధించిన సమాచారం స్థానిక ప్రజాప్రతినిధులందరికి అందించాలని కలెక్టర్ సూచించారు. పట్టణ ప్రాంతంలో మెప్మా వారితో, గ్రామీణ ప్రాంతాలలో ఐకేపి మరియు అంగన్ వాడి, ఆశాల బృందాలను ఏర్పాటు చేసి ఇంటింటికి తిరిగి వ్యాక్సినేషన్ కాని వారిని గుర్తిస్తున్నామని, ప్రతి ఇంటి పై వ్యాక్సినేషన్ స్టికర్ అతికించాలని కలెక్టర్ సూచించారు.
అనంతరం మగ్గిడి, ఎడపల్లి గ్రామాలలోని బృహుత్ పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించి అందులో నాటిన మొక్కలను జాగ్రత్తగా కాపాడాలని, మొక్కలు ఎండిపోకుండా ఎప్పటికప్పుడు మొక్కలకు నీరు అందించాలని తెలుపుతూ 31000 మొక్కలు నాటిన సర్పంచ్ ను, సిబ్బందిని అభినందించి మొక్కలు నాటారు. అనంతరం గాదెపల్లి గ్రామంలో ప్రభుత్వ భూములను పరిశీలించి ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని తహసీల్దార్ కు తెలియచేసారు.
ఈ పర్యటనలో స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ శ్రీమతి జె. అరుణశ్రీ, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి వినోద్ కుమార్, తాసిల్దార్ ధర్మపురి ఎన్. వెంకటేష్, ఎంపీడీవోలు , పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమంను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

జిల్లాపౌరసంబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాల చే జారిచేయనైనది.

Share This Post