ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం (PMEGP) అవగహన సదస్సు

వార్త ప్రచురణ

ములుగు జిల్లా: (ఏటూరు నాగారం)

తేదీ 17.09.2021.

ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం (PMEGP) పైన    శుక్రవారం రోజున  ఏటూరు నాగారం ఐటీడిఏ కాన్ఫరెన్స్ హాలులో  అవగాహన సదస్సు ను నిర్వహించడం  జరిగింది. ఈ  కార్యక్రమానికి కార్యక్రమానికి అదనపు కలెక్టర్ ఆదర్శ సురభి పాల్గొని  ఏజెన్సీ ప్రాంతం అయిన ఏటూరునాగారం పరిసర ప్రాంతాలలోని  18 సంవత్సరాలు పైబడిన  యువతీ యువకులు స్వయం సహాయక బృందాలు, సొసైటీ చట్టం 1869 నమోదైన సంస్థలు సహకార సంఘాలు మరియు ట్రస్ట్ పి ఎం ఈ జి పి కింద ప్రతి  కుటుంబం నుంచి ఒక వ్యక్తి మాత్రమేకి మాత్రమే  ఆర్థిక  సాయం పొందేందుకు అర్హులు  అని అదనపు కలెక్టర్ అన్నారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్  మాట్లడుతూ  గరిష్ట ప్రాజెక్టు తయారీ రంగానికి   వ్యయo  రూ.25 లక్షలు, మరియు సేవా రంగానికి రూ.10 లక్షలు,  కనిష్ట ప్రాజెక్టు తయారీ రంగానికి   వ్యయo 10 లక్షలు,మరియు సేవా రంగానికి రూ. 5 లక్షలు  రుణం మంజూరు చేయడం జరుగుతుందని అదనపు కలెక్టర్  అన్నారు. ఈ యొక్క రుణం మంజూరు కి అర్హత కలిగిన అభ్యర్థులు కనీసం 8వ తరగతి ఉత్తిర్ణత కలిగిన  వ్యక్తుల అయిఉండాలని అదనపు కలెక్టర్ అన్నారు. దరఖాస్తు విధానం ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేయాలని అదనపు కలెక్టర్   అన్నారు.

ఈ యొక్క సదస్సు లో 320 మంది నిరుద్యోగ యువతీ యువకులు, డ్వాక్రా గ్రూపు సభ్యులు పాల్గొన్నారు. వారిలో 151 మంది సభ్యులు ధరఖాస్తులు సమర్పించారు.

ఈ కార్యక్రమంలో  ఎపిఓ వసంతరావు,ఎల్ డి యం ఆంజనేయులు, రాష్ట్ర నోడల్ అధికారి (PMEGP) జి. నారాయణ రావు, జనరల్ మేనేజర్ ఇండస్ట్రీస్ నో శ్రీనివాస రావు, జిల్లా కోఆర్డినేటర్ (PMEGP) రాజేష్, డి డి ట్రైబల్ వెల్ఫేర్ ఏర్రయ్య,ఏపీడీ శ్రీనివాస్ రావు, తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post