ప్రెస్ రిలీజ్
జనగాం జిల్లా , నవంబర్ – 28.
ప్రధానమంత్రి ఉపాధి కల్పనా పథకం లక్ష్యాలను పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య ……..
ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం లక్ష్యాలను పూర్తి చేయాలని అన్నారు జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య, సోమవారం నాడు కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకంలో ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్, ఖాదీ విలేజ్ బోర్డ్, జిల్లా పరిశ్రమల శాఖ మొత్తం (75) యూనిట్స్ లక్ష్యం గాను (22) యూనిట్స్ వివిధ బ్యాంకులలో ఋణం మంజూరు చేయనైనదని మిగిలిన లక్ష్యాలు జనవరి, 2023, చివరి నాటికి పూర్తి చేయాలని అన్నారు.
అనంతరం డిస్టిక్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ కమిటీ సమావేశం నిర్వహించారు (టీఎస్-ఐపాస్)
ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఆరు పరిశ్రమలకు అనుమతులు కోసం దరఖాస్తు రాగా 11 శాఖల అనుమతులు ఇవ్వాల్సి ఉందని అన్నారు. ఇప్పటికే ఐదు దరఖాస్తులను పరిశీలించి అనుమతులు ఇచ్చామన్నారు. మిగిలినవి టీఎస్ ఐపాస్ నిబంధనల మేరకు ప్రభుత్వ రూల్స్ అనుసరించి వెంటనే అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, నిరుద్యోగ యువత, అందరూ ఈ ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం ద్వారా లబ్ధి పొందాలని అందుకుగాను రేపు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరగబోయే అవగాహన సదస్సుకు హాజరుకావాలని జిల్లా కలెక్టర్ కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల అధికారి కె. రమేష్ ఎల్డీఎం శ్రీధర్, ఎలక్ట్రిసిటీ డిఈ .రవిచంద్ర, కెవిఐసి. రాజేష్ కుమార్, కెవిఐబి అశోక్ కుమార్, సభ్యులు సర్పంచ్ లు, డిక్కీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.