ప్రధానమంత్రి కిసాన్ లబ్ధిదారులందరికీ రుణ సదుపాయం కల్పించుటకు ఈ నెల 24 నుండి మే 1 వరకు కిసాన్ భాగిదారి ప్రాథమిక్త హమారీ పేర ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు.

ప్రధానమంత్రి కిసాన్ లబ్ధిదారులందరికీ రుణ సదుపాయం కల్పించుటకు ఈ నెల 24 నుండి మే 1 వరకు కిసాన్ భాగిదారి ప్రాథమిక్త హమారీ పేర ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు.

శుక్రవారం కలెక్టరేట్ లోని కోర్టు హాల్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక డిసిసి సమావేశంలో పాల్గొన్న అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ పి.ఏం.కిసాన్ లబ్దిదారులకు కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేయవలసినదిగా కేంద్ర ప్రభుత్వం బ్యాంకులకు ఆదేశించిందని అన్నారు. ఆ మేరకు ఈ నెల 24 నుండి అన్ని బ్యాంకుల వారు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని, అందులో వ్యవసాయ, పశు సంవర్ధక, మత్స్య శాఖ, రెవిన్యూ, పంచాయతీ కార్యదర్శులు, యెన్.ఎల్.ఆర్.ఏం. ప్రాజెక్ట్ బ్యాంకు అధికారులు లబ్దిదారులకు అవగాహన కల్పిస్తారని తెలిపారు. గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించి అర్హులైన రైతులను గుర్తించి అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఎటువంటి బ్యాంక్ ప్రాసెసింగ్ డాక్యుమెంటేషన్, ఇన్స్పెక్షన్ వంటివి లేకుండా నేరుగా 1.6 లక్షల రూపాయల వరకు రుణ సౌకర్యం లభిస్తుందని అన్నారు. లబ్ధిదారులు పి .ఏం. కిసాన్ పోర్టల్ ద్వారా లేదా సంబంధిత బ్యాంకు శాఖలకు నుండి కిసాన్ క్రెడిట్ కార్డులు పొందవచ్చని సూచించారు.అలాగే ఇప్పటి వరకు పంట రుణాలు పొందని రైతుల వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు బ్యాంకర్లకు అందజేస్తే అట్టివారికి బ్యాంకర్లు రుణాలు అందజేస్తారని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా రైతులు ప్రతిఒక్కరు ప్రయోజనం పొందేలా ప్రచారం నిర్వహించాలని అదనపు కలెక్టర్ అన్నారు.

ఈ సమావేశంలో యల్డియం రిజ్వీ నాబార్డ్ డిడియం శివిశర్మ, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి అంజిల్ప, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సునంద, వ్యవసాయ శాఖ ఏడి మల్లికార్జున రావు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post