ప్రధానమంత్రి ఫర్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ఎంటర్ప్రైజెస్ (PM FME) జిల్లాస్థాయి కమిటీ సమావేశం : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన
తేది:13 8 2021
వనపర్తి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి కల్పనకు ఏర్పాటు చేసే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పి ఉపాధి పొందాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష తెలిపారు.
శుక్రవారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో ప్రధానమంత్రి ఫర్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ఎంటర్ప్రైజెస్ (PM FME) జిల్లాస్థాయి కమిటీ సమావేశం డిఆర్డీఓ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆహార ఉత్పత్తుల లబ్ధిదారుల నుండి ప్రతిపాదనలు కొరకు సమావేశం ఏర్పాటు చేయగా జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆహార ఉత్పత్తుల పరిశ్రమల ఏర్పాటులో వేరుశనగ ఉత్ప త్తుల పరిశ్రమ ఏర్పాటు చేసుకోవచ్చని అన్నారు. వ్యక్తులుగానే ఎస్ హెచ్ జి గ్రూపుల సభ్యులు గాని 35 శాతం మార్జిన్ మనీ తో 10 శాతం పెట్టుబడి తో యూనిట్ ఏర్పాటు చేసుకోవచ్చని ఆమె అన్నారు. ప్రధానమంత్రి ఫర్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ఎంటర్ప్రైజెస్ (PM FME) జిల్లాస్థాయి కమిటీ సమావేశం కింద అప్ గ్రేడషన్, ఆధునీకరణ కోసం 26 MFES లను ఆమోదించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎల్ డి ఎం సురేష్, ప్రభంజనం ఫుడ్ సొసైటీ, డి డి ఎం(నాబార్డ్), ఎం.వి. ఎస్. ఎస్. శ్రీనివాస్, ఎంప్లాయిమెంట్ అధికారి అనిల్ కుమార్, అగ్రికల్చర్ అధికారి ఏవో సుధాకర్ రెడ్డి, హార్టికల్చర్ అధికారి, ఎంపీడీవో శ్రీపాద, ఎఫ్ పి ఓ అనంత రెడ్డి, డి.ఆర్.పి.జస్వంత్ రెడ్డి, సర్పంచ్ సూర్య చంద్ర రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
……….
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి నుండి జారీ చేయడమైనది.

Share This Post