. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద లబ్ధిదారుల ఎంపిక సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

అర్హులైన వారందరికీ అవకాశం ఇవ్వాలి

మత్స్యశాఖ జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో.. జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

00000

జిల్లా మత్స్యశాఖ నుంచి లబ్ధి పొందేందుకు వివిధ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారందరికీ అవకాశం కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్ మత్స్య శాఖ అధికారిని ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన స్కీమ్ కింద మత్స్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మత్స్య సంపద యోజన స్కీమ్ కింద దరఖాస్తు చేసుకున్న 48 మంది దరఖాస్తులను పరిశీలించి ఎంపిక చేయాలని కలెక్టర్ తెలిపారు. అనంతరం 6 రకాల అంశాలను చర్చించారు. చేపల చెరువుల నిర్మాణం, వి – సర్క్యులేటరి ఆక్వా కల్చర్ సిస్టం, ఫిష్ ఫీడ్ మీల్, ద్విచక్ర వాహనాలు, ఇన్సులేటర్ త్రీ వీలర్ వాహనాలు తదితర అంశాలపై చర్చించి కమిటీ సమావేశం తిరిగి మరొకసారి నిర్వహించుటకు కలెక్టర్ ఆదేశించారు.

 

Share This Post