ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెస్సింగ్ ఎంటర్ ప్రైజెస్ పధకం ద్వారా స్వయం సహాయక సంఘ సభ్యులు లబ్దిపొంది, ఆర్థిక స్వావలంబన పొందాలి: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

జనగామ, అక్టోబర్ 11: ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెస్సింగ్ ఎంటర్ ప్రైజెస్ పధకం ద్వారా స్వయం సహాయక సంఘ సభ్యులు లబ్దిపొంది, ఆర్థిక స్వావలంబన పొందాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో జిల్లాలో పథక అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మైక్రో ఫుడ్ ప్రాసెస్సింగ్ పధకంలో 327 మహిళా సంఘ సభ్యులను ఇప్పటికి నమోదు చేయడం జరిగిందన్నారు. ఈ 327 సంఘాల మహిళలకు 6 శాతం వడ్డీతో ఒక్కొక్కరికి 40 వేల రూపాయల చొప్పున ఋణం మంజూరు చేశామన్నారు. ఈ సంఘాల మహిళలు వారి వారి యూనిట్ ని అభివృద్ధి చేసుకొనుటకు వారి దరఖాస్తును, ప్రాజెక్టు రిపోర్ట్ ని DRP ఆన్లైన్లో నమోదు చేయడం జరిగిందన్నారు. ఆసక్తి ఉన్నవారు 66 మంది మహిళలు 35% సబ్సిడీ స్కీం లో నమోదు అయ్యారన్నారు. ఈ 66 గురి దరఖాస్తులు పరిశీలించి ఆమోదానికి చర్యలు చేపట్టామన్నారు. తరువాత స్థాయిలో ఇట్టి 66 దరఖాస్తులను అన్ని బ్యాంకులకు బదలాయింపు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.
ఈ సమావేశంలో డిఆర్డీవో జి.రాంరెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్ టీఎస్. శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి టి.రాధిక, జిల్లా ఉద్యానవన అధికారిణి జి.లత, జిఎం ఇండస్ట్రీస్ రమేష్, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
———————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post