ప్రపంచంలోనే అతి విలువైన పసిడి, వజ్ర, వైఢుర్యాల వనరుల కంటే విలువైన సంపద భారత దేశ యువత అని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు.

ప్రచురణార్ధం

జనవరి, 12 ఖమ్మం

ప్రపంచంలోనే అతి విలువైన పసిడి, వజ్ర, వైఢుర్యాల వనరుల కంటే విలువైన సంపద భారత దేశ యువత అని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జిల్లా, యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో బుధవారం సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహించిన జాతీయ యువజన దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని, స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసారు. ఈ సదర్భంగా యువతనుద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచదేశాలలో ఒక్కొక్క దేశం ఏదైనా నగరా లకు ప్రత్యేకత కలిగి ఉంటుందని, అయితే మన భారత దేశం ప్రత్యేకత నేటి యువతేనని కలెక్టర్ అన్నారు. ఇతర దేశాలలోని జనాభాలో సగాని కంటే పైగా యాభై సంవత్సరాల పైబడిన వారుంటే, మన దేశ జనాభాలో యువత సంఖ్య అధికంగా ఉందన్నారు. యవ్వన దశలోనే మేధాశక్తి చురుకుగా ఉంటుందని, విద్యతో పాటు, వివిధ క్రీడా రంగాలలో ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగపర్చుకొని అనుభవాన్ని, నైపుణ్యతను పెంపొందించుకొని భవిష్యత్తులో అన్ని రంగాలలో యువత ముందంజలో ఉండాలని కలెక్టర్ ఈ సందర్భంగా అన్నారు. యువజన ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన వివిధ కార్యక్రమాలలో ఉత్తమ సేవలు అందించిన యువజన సంఘాలకు క్రీడాకారులకు జిల్లా కలెక్టర్ మెమోంటోలను అందజేశారు. అదేవిధంగా రక్తదాన శశిభిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు.

జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పరందామరెడ్డి, బ్యాడ్మింటన్ అసోసియోషన్ సభ్యులు సిరిపురపు సుదర్శన్ రావు, ఒలంపిక్ అసోసియోషన్ సెక్రటరీ రఘునందన్, నేషనల్ యూత్ అవార్డు గ్రహీత బందారుపల్లి లక్ష్మయ్య, అథ్లెటిక్ అసోసియేషన్ సెక్రటరీ యం.డి.షఫీ, మహిళా క్రికెట్ అసోసియోషన్ సెక్రటరీ యం.డి. మతీన్, అథ్లెటిక్ కోచ్ యం.డి.గౌస్, వివిధ క్రీడల కోచ్లు, క్రీడా, యువజన, మహిళా సంఘాలు, క్రీడాకారులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share This Post