ప్రపంచంలోనే భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని, ఈ దేశాన్ని ఒకే తాటిపై నడిపించే రాజ్యాంగం మనదని : స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్

అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్

దేశాన్ని ఒకే తాటిపై నడిపించే రాజ్యాంగం మనది

అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్

ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
000000

ప్రపంచంలోనే భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని, ఈ దేశాన్ని ఒకే తాటిపై నడిపించే రాజ్యాంగం మనదని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ తెలిపారు.

రాజ్యాంగాన్ని ఆమోదించి 72 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా, ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఐదేళ్లకొకసారి ఎన్నికలు జరుగుతూ ప్రభుత్వాలు వస్తుంటాయని, కానీ రాజ్యాంగం మాత్రం స్థిరంగా ఉంటుందని అన్నారు. అనంతరం రాజ్యాంగ ప్రమాణం పై ప్రతిజ్ఞ చేయించారు.

భారతదేశ ప్రజలమగు మేము సార్వభౌమ్య సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా నెలకొల్పుటకు మరియు అందలి పౌరులు ఎల్లరకు సామాజిక ఆర్థిక, రాజకీయ, న్యాయమును, భావము, భావ ప్రకటన విశ్వాసము, ధర్మము, ఆరాధన వీటి స్వాతంత్ర్యమును, అంతస్తు లోనూ అవకాశము లోనూ సమానత్వంను చేకూర్చుటకు, మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును, జాతి ఐక్యతను, అఖండతను తప్పక ఒనగూర్చు సౌభ్రాతృత్వమును పెంపొందించుటకు సత్యనిష్టపూర్వకంగా తీర్మానించుకుని 1949 వ సంవత్సరం నవంబర్ 26 వ దినమున మా సంవిధాన సభయందు ఇందుమూలముగా ఈ సంవిధానం అంగీకరించి, అది శాసనము చేసి మాకు మేము ఇచ్చుకున్న వారమైతిమి… అని రాజ్యాంగ దినోత్సవ ప్రమాణ ప్రతిజ్ఞ చేయించారు.

అంతకుముందు ఆజాదికా అమృత్ ఉత్సవాలలో భాగంగా వర్చువల్ విధానంలో ప్రజలనుద్దేశించి ఢిల్లీ నుంచి ప్రసారమైన భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి భారత సంవిధానం గురించి ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, కలెక్టరేట్ ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post