ప్రపంచం మెచ్చిన భారత గణిత శాస్త్రవేత్త రామానుజన్‌ – అసిస్టెంట్ కమిషనర్ రాజశేఖర్ రావు

ప్రపంచం మెచ్చిన భారత గణిత శాస్త్రవేత్త రామానుజన్‌ – అసిస్టెంట్ కమిషనర్ రాజశేఖర్ రావు

అనంతాన్ని కనుగొని ప్రపంచ గణితానికే లెక్కలు నేర్పిన గొప్ప గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్‌ అని అసిస్టెంట్ కమిషనర్ ఎగ్జామినేషన్ రాజశేఖర్ రావు అన్నారు.

శ్రీనివాస రామానుజన్‌ పుట్టిన రోజును పురస్కరించుకుని గణితశాస్త్ర దినోత్సవాన్ని నాగర్కర్నూల్ డిఈఓ కార్యాలయం లో బుధవారం ఘనంగా నిర్వహించారు.

పూలమాలలతో అలంకరించారు.

ఈ కార్యక్రమంలో ఆయన పలు విషయాలను తెలియజేశారు. శ్రీనివాసరామానుజన్‌ అపార ప్రతిభాపాటవాలతో గణిత శాస్త్రంలో అనేక కొత్త సిద్ధాంతాలను కనిపెట్టారని చెప్పారు.

సున్నాను కనిపెట్టి ప్రపంచ గణిత శాస్త్రానికి భారతీయులు అద్భుత కానుకను అందించారని తెలిపారు. ప్రస్తుత విద్యార్థులు రామానుజన్‌ను స్ఫూర్తిగా తీసుకుని గణితశాస్త్రంలో అద్భుతాలు సృష్టించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి కృష్ణా రెడ్డి, కార్యాలయ పర్యవేక్షకులు మురళి కృష్ణ, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, రాజేందర్ రెడ్డి ఉపాధ్యాయులు వెంకట్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ సురేందర్ రెడ్డి, తాహెర్ పాషా గణిత ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post