ప్రపంచస్థాయిలో రాణించాలి:: జిల్లా కలెక్టర్ డి హరిచందన

ప్రపంచస్థాయిలో రాణించాలి. జిల్లా కలెక్టర్ డి హరిచందన.

టాగ్ ఆఫ్ వార్ జాతీయ స్థాయి పోటిలలో జిల్లా కు చెందిన క్రీడాకారులకు బుధవారం ఉదయం కలెక్టరేట్ ఆవరణంలో జిల్లా కలెక్టర్ డి. హరిచందన క్రీడాకారులకు  అభినదిస్తూ ప్రపంచ స్థాయి రాణించాలని కొనియాడారు. నవంబర్ 21 నుండి 27వ తేది వరకు మహారాష్ట్రలోని పాల్ గర్ లో జరిగిన జాతీయ స్థాయి టాగ్ ఆఫ్ వార్ పోటిల్లో సినియార్స్ అండర్ 19, అండర్ 17, అండర్ 15, అండర్ 13 సంవత్సరాల పోటిల్లో తెలంగాణ రాష్ట్రం నుండి 180 మంది క్రీడాకారులు పాల్లోనగా నారాయణపేట జిల్లా నుండి 20 మంది పోటిల్లో పాల్గొన్నారు. అందులో నారాయణపేట జిల్లాకు 25 పథకాలు రావడం జరిగిదని జిల్లా కలెక్టర్ కు తెలిపారు. అందులో బంగారు పథకాలు 4, వెండి పథకాలు 16, క్యాసం పథకాలు 5 సాదించడం జరిగింది జాతీయ స్థాయి పోటిలలో రాష్ట్రం నుండి పాల్లోన్న మన జిల్లా క్రీడాకారులు అసమాన క్రీడా ప్రతిభను కనపరిచి పథకాల పంట పండించారు.

కార్యక్రమంలో పాల్లోన్న వారు టాగ్ ఆఫ్ వార్ అసోసియేషన్ జిల్లా గౌరవ అద్యక్షుడు కోడoగల రఘు ప్రసన్న భట్ ,  అద్యక్షులు బి.గోపాలం, ఉపాధ్యక్షుడు బి.శ్రీనివాసులు కార్యదర్శి అంబ్రెష్, దామోదర్ మరియు క్రీడాకారులు పాల్గొన్నారు.

Share This Post