ప్రపంచానికే ఆదర్శమూర్తి మహాత్మా గాంధీ – అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి

అహింసా శాంతి మార్గాన్ని అనుసరిస్తూ యావత్ భారతావని ని ఏకం చేసిన మహాత్ముడు మన బాపూజీ అని అందుకే ప్రపంచానికి ఆదర్శమూర్తుడయ్యారని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం జాతిపిత మహాత్మాగాంధీ 152వ జయంతి వేడుకలను పురస్కరించుకుని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ…
గాంధీజీ అహింస ఆయుధంగా బ్రిటీష్‌ వారిని ఎదిరించి, శాంతియుతంగా పోరాడి దేశానికి స్వాతంత్రం అందించి జాతిపితగా నిలిచారని ఆయన కొనియాడారు.
ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన గాంధీ ఏ విషయమైనా ముందు తాను ఆచరించి తర్వాత ఇతరులకు ఆచరించమన్నారని తెలిపారు. గాంధీజీ ఆశయాలను నేటి తరం విద్యార్థులకు తెలిసే విధంగా ఆయన జీవిత చరిత్రను పాఠ్య పుస్తకములో చేర్చితే బాగుండేదని తన అభిప్రాయం అన్నారు. గాంధీజీ పాటించిన సత్యం, అహింసా మార్గాలను నేటి యువత పాటించాలనన్నారు.
గాంధీజీ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నర్సింగ్ రావు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రామ్ లాల్, పౌర సంబంధాల శాఖ అధికారి సీతారాం, పౌరసరఫరాల అధికారి మోహన్ బాబు, గంధం ప్రసాద్, విజువల్స్ రూపకర్త దేవేంద్ర చారి, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post