ప్రపంచానికే ఆదర్శమూర్తి మహాత్మా గాంధీ – జిల్లా కలెక్టర్ డి హరిచందన

ప్రపంచానికే ఆదర్శమూర్తి మహాత్మా గాంధీ – జిల్లా  కలెక్టర్ డి హరిచందన

అహింసా శాంతి మార్గాన్ని అనుసరిస్తూ యావత్ భారతావని ని ఏకం చేసిన మహాత్ముడు మన బాపూజీ అని అందుకే ప్రపంచానికి ఆదర్శమూర్తుడయ్యారని జిల్లా  కలెక్టర్ డి హరిచందన  అన్నారు.  శనివారం జాతిపిత మహాత్మాగాంధీ 152వ జయంతి  వేడుకలను పురస్కరించుకుని

నారాయణపేట  జిల్లా కలెక్టరేట్  కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు.   ఈ సందర్భంగా  కలెక్టర్ మాట్లాడుతూ… గాంధీజీ అహింస ఆయుధంగా బ్రిటీష్‌ వారిని ఎదిరించి, శాంతియుతంగా పోరాడి దేశానికి స్వాతంత్రం అందించి జాతిపితగా నిలిచారని ఆయన కొనియాడారు.

ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన గాంధీ ఏ విషయమైనా ముందు తాను ఆచరించి తర్వాత ఇతరులకు ఆచరించమన్నారని తెలిపారు. గాంధీజీ ఆశయాలను నేటి తరం విద్యార్థులకు తెలిసే విధంగా  ఆయన జీవిత చరిత్రను పాఠ్య పుస్తకములో చేర్చితే బాగుండేదని తన అభిప్రాయం  అన్నారు. గాంధీజీ పాటించిన సత్యం,

అహింసా మార్గాలను నేటి యువత పాటించాలనన్నారు. గాంధీజీ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి గోపాల్ నాయక్, జిల్లా బిసి  అధికారి క్రిష్ణమ చారి, సిపిఓ గోవిందరాజన్, కలెక్టరేట్ ఏఓ నర్సింగ్ రావు, ఖలీద్ మరియు  కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post