ప్రపంచాన్ని మార్చే శక్తి ఓటు కు ఉందని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా పరిషత్ చైర్మన్ సరిత తిరుపతయ్య అన్నారు.

ప్రపంచాన్ని మార్చే శక్తి ఓటు కు ఉందని,  ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా పరిషత్ చైర్మన్ సరిత తిరుపతయ్య అన్నారు.

బుధవారం జాతీయ ఓటర్ల  దినోత్సవం సందర్భంగా విద్యార్థిని విద్యార్థులచే ర్యాలీని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి  గారి తో కలిసి వైయస్సార్ చౌక్ లో జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని అన్నారు. ప్రజాస్వామ్యం లో ఓటుకు చాలా విలువ ఉందని. ప్రభుత్వాలను మార్చే శక్తి ఓటు కలిగి ఉన్నదని తెలిపారు. ఓటును దుర్వినియోగం చేసుకోకుండా మంచి వ్యక్తులకు ఓటు వేసి ఓటు ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా 18 సంవత్సరాలు   పైబడిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని తెలిపారు. బారత దేశం ప్రజా స్వామ్య దేశం కాబట్టి ఎన్నికల ద్వారా మీరు అనుకున్న నేతను ఎన్నుకునే హక్కు మీకు ఉందని అన్నారు. . మొబైల్ ఫోన్ తో ఓటరు హెల్ప్ లైన్ యాప్ ద్వారా పూర్తి వివరాలతో ఓటును నమోదు చేసుకోవచ్చన్నారు. విద్యార్థులు అందరు మీ హక్కు ను వినియోగించుకోవాలని అన్నారు.

ఈ సందర్భంగా వై ఎస్ ఆర్ చౌక్ పాత బస్టాండ్ నుండి మొదలు పెట్టి కృష్ణవేణి చౌక్ నుండి రాజీవ్ మార్గము   ద్వారా ర్యాలీ నిర్వహించారు.

 

ఈ కార్యక్రమంలో అదనప కలెక్టర్ అపూర్వ చౌహాన్, ఆర్ డి ఓ రాములు, ఇంటర్ మీడియాట్ కోఅర్దినేటర్  హృదయ రాజు,  జాడ్ పి సి ఇ ఓ విజయనయాక్, డిప్యూటీ సీఈఓ ముసాయిదా బేగం, ఇ డి ఎస్సి కార్పోరేషన్ రమేష్ బాబు,  శ్వేత ప్రియదర్శిని,  డి పి ఆర్ ఓ చెన్నమ్మ, ఎం ఆర్ ఓ వెంకటేశ్వర్లు, విద్యార్థిని, విద్యార్థులు , సంబందిత  అధికారులు ,తదితరులు  పాల్గొన్నారు.

——————————————————————————-

జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాలచే జారీ చేయబడింది.

 

 

Share This Post