ప్రపంచ అయోడిన్ లోప రుగ్మతల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గోడ పత్రికను ఆవిష్కరించిన అదనపు కలెక్టర్ రాజర్షి షా

ప్రపంచ అయోడిన్ లోప రుగ్మతల నివారణ దినోత్సవాన్ని
(అక్టోబర్ 21) పురస్కరించుకుని బుధవారం కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ రాజర్షి షా
“అయోడైజ్డ్ ఉప్పు -ఆరోగ్యమైన జీవితానికి నాంది”
“అయోడైజ్డ్ ఉప్పునే వాడుదాం పిల్లలు ఆరోగ్యంగా జీవించే హక్కును కాపాడుదాం” గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 21 నుండి నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా అయోడైజ్డ్ ఉప్పు వాడకంపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. సబ్ సెంటర్ల పరిధిలో ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు అవగాహన కల్పిస్తారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిఎంఅండ్హెచ్ఓ డా.గాయత్రి దేవి, డాక్టర్ శశాంక, డాక్టర్ మహేందర్ రెడ్డి, డి పి ఓ సురేష్ మోహన్, డి ఆర్ డి ఓ శ్రీనివాస రావు, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, వైద్య ఆరోగ్య శాఖ కోఆర్డినేటర్లు ముంతాజ్ అలీ, భారత్ సత్యనారాయణ, సిబ్బంది విష్ణువర్ధన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Share This Post